అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రాజధానిపై తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం మూడు రాజధానుల నిర్ణయంవైపే మొగ్గు చూపిస్తున్న నేపధ్యంలో ఏపీలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని ఆందోళనలు కొనసాగిస్తున్నారు రాజధాని గ్రామాల రైతులు . అతి పెద్ద పండుగగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా ఏపీ ప్రలజు జరుపుకునే పండుగను సైతం జరుపుకోకుండా రాజధాని గ్రామాల అరితులు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో కోడి పందాలను చూడటానికి వెళ్ళిన తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏలూరులో సంక్రాంతి కోడిపందాల్లో పాల్గొన్న తెలంగాణా మంత్రి

ఏలూరులో సంక్రాంతి కోడిపందాల్లో పాల్గొన్న తెలంగాణా మంత్రి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి సందర్భంగా సందడి చేశారు. స్థానికులతో కలిసి కోడి పందాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన ఆయన రాజధాని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు ఇక్కడకు వస్తానని, గోదావరి జిల్లాలలో సంక్రాంతికి పండుగ బాగా నిర్వహిస్తారని, సాంప్రదాయంగా జరుపుతారని మంత్రి తలసాని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ పొరపాట్ల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సమస్య

గత ప్రభుత్వ పొరపాట్ల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సమస్య

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ పొరపాట్ల వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని సమస్య తలెత్తిందన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏపీ రాజధాని విషయంతో శాశ్వత పరిష్కారం ఉండాలని తెలిపారు. ఇక రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జోలె పట్టుకొని భిక్షమెతుకునే నాయకులను నమ్మకండని సూచించారు. జగన్ ప్రజలకు అన్యాయం చెయ్యరని,రాజధాని రైతులకు అన్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు.

రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమన్న తలసాని

రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమన్న తలసాని


చంద్రబాబు వంటి నాయకులను నమ్మితే కుక్క తోకతో గోదారి ఈదుతున్నట్లే ఉంటుందన్నారు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశామని ఆయన పేర్కొన్నారు.రాజధాని అంశం పూర్తిగా ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినది కాబట్టి తాను మాట్లాడనని స్పష్టం చేశారు. సీఎం జగన్ కు అన్నీ తెలుసని , ఏది నిర్దాక్షిణ్యంగా తొలగించరని పేర్కొన్నారు.

ప్రజల ఆకలి తెలిసిన నాయకుడు జగన్ అంటూ కితాబు

ప్రజల ఆకలి తెలిసిన నాయకుడు జగన్ అంటూ కితాబు

రైతులు సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజధాని విషయంలో రైతులకు కొంత ఆందోళన ఉందన్న ఆయన ప్రభుత్వంతో చర్చలు జరిపితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందిని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు గురిపించిన తలసాని రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంతో ఉంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి మంచి ఫలితాలే వస్తాయని తలసాని పేర్కొన్నారు . జగన్ ప్రజల ఆకలి తెలిసినవాడని వ్యాఖ్యానించారు. ఏపీకి అంతా మంచి జరుగుతుంది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.

English summary
Telangana Minister Talasani Srinivas Yadav went to ap for traditional hen fight. He attended the Sankranti celebrations in the West Godavari district and spent time with the locals. The capital issue is limited to the AP .. He said he will not react on it. at the same time he fired on former cm chandrababu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X