కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చొప్పదండి బ్యాంకు దోపిడీ: ప్రధాన సిమి కార్యకర్త అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ఎస్‌బిఐ బ్యాంకులో దోపిడీకి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ప్రధాని నిందితుడ్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దోపిడీకి పాల్పడిన వారందరూ నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి కార్యకర్తలని ఎన్ఐఏ తేల్చింది. బ్యాంకులోని సిసి కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి ప్రధాన నిందితుడు అబూ ఫైజల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ ప్రకటించింది.

మరో నలుగురు సిమి కార్యకర్తల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరిందరూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండువా జైలు నుంచి తప్పించుకుని దోపిడీలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ తేల్చింది. దేశ వ్యాప్తంగా సిమి కార్యకర్తలు ఆరు బ్యాంకుల్లో దోపిడీకి పాల్పడ్డట్లు ఎన్ఐ వెల్లడించింది. దోపిడీకి పాల్పడిన డబ్బుతో మహారాష్ట్రలో ఐఈడి బాంబులను తయారు చేస్తున్నట్లు సమాచారం.

Telangana police detect bank heists link with terror

గత ఫిబ్రవరి 1వ తేదీన చొప్పదండి ఎస్‌బిఐ బ్రాంచ్‌లో 46 లక్షల రూపాయల దోపిడీ జరిగింది. బ్రాంచ్ మేనేజర్‌ను బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు మోటార్ సైకిళ్లపై వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిరుడు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సెంట్రల్ జైలు నుంచి ఏడుగురు సిమి కార్యకర్తలు తప్పించుకున్నారు. వారే ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కోసం దోపిడీలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు ఉన్నాయి. జైలు నుంచి తప్పించుకున్న ఏడుగురిలో సిమి నేత అబూఫైజల్ సహా నలుగురిని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

అక్టోబర్ 2వ తేదీన పశ్చిమబెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఒక ఇంట్లో బాంబు పేలుళ్లు జరిగాయి. అక్కడ కొంత సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంటిని సిమి కార్యకర్తలు, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు అద్దెకు తీసుకుని బాంబులు తయారుచేస్తుండగా బాంబుపేలింది. ఈ కేసును నేషనల్ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. బుర్ద్వాన్‌లో రికవరీ చేసుకున్న కరెన్సీ నోట్లలో చొప్పదండిలో ఎస్‌బిఐ బ్రాంచ్ నుంచి దోచుకున్న నగదు కట్టలు ఉన్నట్లు పోలీసు వర్గాల పరిశోధనలో వెల్లడైనట్లు సమాచారం.

చొప్పదండిలో దోపిడీ చేసిన సొమ్ముతో సిమి కార్యకర్తలు యుపిలోని బిజ్నూర్‌లోని కాజీపడకు వెళ్లి అక్కడ గది అద్దెకు తీసుకుని బాంబులు తయారు చేయడం మొదలుపెట్టగా పేలాయి. గాయపడిన వారిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా చికిత్సకు నిరాకరించారు. దాంతో ఒక లక్ష రూపాయల నగదు ఇచ్చారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ డాక్టర్‌ను విచారించి 96 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

English summary

 Investigations by the Telangana police have found terror links to around eight bank robberies in the country inclu-ding that of Choppadandi in Karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X