వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీరు ఎక్కబోయే విమానం..’:ఇక విమానాశ్రయాల్లో తెలుగులోనూ అనౌన్స్‌మెంట్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ చేస్తారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ చేస్తారని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు సంస్థలు నిర్వహిస్తున్న ఎయిర్‌లైన్స్‌లతోపాటు ఎయిర్‌పోర్టులలో కూడా తెలుగులో అనౌన్స్‌మెంట్లు ఉండాలని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ రాసిన లేఖకు కేంద్రమంత్రి స్పందించారు.

దేశంలో అనేక భాషలు ఉన్నందున అన్ని భాషలలో క్రూ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కష్టసాధ్యమని, అందువల్లనే డొమెస్టిక్ విమానాల్లో హిందీ, ఇంగ్లీషులలో మాత్రమే అనౌన్స్‌మెంట్ చేస్తున్నామని వివరించారు.

Telugu at Andhra Pradesh airports

అయితే, మన రాష్ట్రంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా స్వంతంగా నిర్వహిస్తున్న విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టులలో ఇక నుంచి హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా అనౌన్స్‌మెంట్ ఉంటుందని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

English summary
Civil Aviation minister P Ashok Gajapathi Raju promised that henceforth the public announcements would be made in Telugu language besides English and Hindi in all flights, operated by various airlines and also at five airports across Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X