వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపి కి సినీ గ్లామ‌ర్‌ : టిడిపి..జ‌న‌సేన కి దూరం: కేసీఆర్ బెదిరింపులా...జూనియ‌ర్ ఎఫెక్టా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : వైసిపి కి సినీ గ్లామ‌ర్‌ టిడిపి.. జ‌న‌సేన కి దూరం..కేసీఆర్ ఎఫెక్టా..!

ఏపిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. సినీ న‌టులు పెట్టిన రెండు పార్టీలైన టిడిపి..జ‌న‌సేన‌ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నాయి. మ‌రో వైపు వైసిపి. కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు వ‌రుస‌గా వైసిపి బాట ప‌ట్టారు. వైసిపి లో చేరి ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అదే స‌మ‌యంలో టిడిపి..జ‌నసేనకు దూరంగా ఉంటు న్నారు. ఇది ఇప్పుడు సినీ క‌మ్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది..

<strong>నాకు వైసిపియే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి : 2018 త‌రువాత టిడిపి లేదు : ప‌వ‌న్ క‌ళ్యాన్ సంచ‌ల‌నం...!</strong>నాకు వైసిపియే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి : 2018 త‌రువాత టిడిపి లేదు : ప‌వ‌న్ క‌ళ్యాన్ సంచ‌ల‌నం...!

వైసిపి సినీ గ్లామ‌ర్ ఎందుకంటే..

వైసిపి సినీ గ్లామ‌ర్ ఎందుకంటే..

గ‌తంలో సినిమా ఇండస్ట్రీ ఎక్కువ‌గా టిడిపికి మ‌ద్ద‌తుగా నిలిచేది. సినీ రంగానికి చెంద‌ని ప‌లువురు టిడిపి లో యాక్టివ్ రోల్ పోషించే వారు. అయితే, ఇప్పుడు టిడిపికి ఆ సినీ గ్లామ‌ర్ త‌గ్గిపోయింది. నంద‌మూరి హీరోలే పార్టీకి దూరంగా ఉం టున్నారు. బాల‌కృష్ణ మిన‌హా మిగిలిన వారు అంత క్రియాశీల‌కంగా లేరు. ఎన్నిన‌క‌ల స‌మ‌యంలోనూ పార్టీ కోసం ప్ర‌చా రానికి ముందుకు రావ‌టం లేదు. తార‌క ర‌త్న‌, దివ్య వాణి మిన‌హా మ‌రెవ‌రూ ప్ర‌చారంలో క‌నిపించ లేదు. ఇక, శివాజీ ప్ర‌చారం లోకి రాక‌పోయినా.. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఉంఉన్నారు. ఇదే స‌మయంలో జ‌న‌సేన అధినేత సైతం సినీ రంగానికి చెందిన వారే. అయితే, ఆ పార్టీకి సినీ గ్లామ‌ర్ క‌నిపించం లేదు. నాగ బాబు మిన‌హా మ‌రెవ‌రూ ఆ పార్టీలో లేరు. జ‌బ‌ర్ద‌స్త్ న‌టులు మాత్రం కొంద‌రు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ రెండు పార్టీల‌కు సినీ రంగం నుండి ల‌భించ‌ని మ‌ద్ద‌తు వైసిపికి ద‌క్కుతోంది.

వైసిపి లో చేరిన సినీ ప్ర‌ముఖులు

వైసిపి లో చేరిన సినీ ప్ర‌ముఖులు

వైసిపి లో రోజా, కొడాలి నాని, విజ‌య్ చంద‌ర్ వంటి వారు తొలి నుండి పార్టీలో ఉన్నారు. ఇక‌, పృధ్వీ , ఆలీ, జయ‌సుధ‌, మోహ‌న్ బాబు, రాజా ర‌వీంద్ర‌, భాను చంద‌ర్ తో పాటుగా జూనియ‌ర్ ఆర్టిస్టులు..టివి క‌ళాకారులు వైసిపి లో చేరారు. ఈ కొత్త చేరిక‌ల పై టిడిపి సైతం విమర్శ‌లు చేసింది. సినీ పరిశ్ర‌మ వైసిపికి ద‌గ్గ‌ర అవ్వ‌టానికి చాలా కార‌ణాలు ఉన్నాయ ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. సినీ ఇండ‌స్ట్రీ నుండి కొంద‌రు ప్ర‌త్యేక హోదా కోసం పోరాట బాట ప‌డితే వారిని టిడిపి ప్ర‌భుత్వం అరెస్ట్ చేసింది. తాజాగా జ‌య‌సుధ‌, మోహ‌న్ బాబు వంటి వారు నేరుగా టిడిపి పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జీవిత‌- రాజ‌శేఖ‌ర్ వైసిపి కి మ‌ద్ద‌తు గా రంగంలోకి దిగుతున్నారు.

కేసీర్ బెదిరింపుల కార‌ణంగా..

కేసీర్ బెదిరింపుల కార‌ణంగా..

కేసీఆర్‌ బెదిరింపుల వల్లే జగన్‌ దగ్గరకు సినీనటులు క్యూ కడుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయి తే, నంది అవార్డుల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు అప్ప‌ట్లోనే వివాదాస్ప‌దం అయింది. దీని పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, అలీ వంటి వారు వైసిపి లో చేర‌గానే..కేసీఆర్ బెదిరింపుల కార‌ణంగానే వైసిపి లో చేరారంటూ టిడిపి నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇక‌, నంద‌మూరి కుటుంబం లోని వారే టిడిపికి దూరంగా ఉంటున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ను 2009 ఎన్నిక‌ల ప్ర‌చారం లో వినియోగించుకొని ఆ త‌రువాత నిర్ల‌క్ష్యం చేసిన అంశం సైతం వారి పైన ప్ర‌భావం ప‌డింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ఇక‌, ఏపిలో సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ది కోసం ఎక్కడా దృష్టి పెట్ట‌క‌పోవటం కూడా సినీ ప‌రిశ్ర‌మ‌కు రుచించ‌టం లేదు. అయితే, టిడిపికి మ‌ద్ద‌తుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు, ర‌ఘుబాబు ఎన్నిక‌ల ప్ర‌చార యాడ్స్ త‌యారీలో స‌హ‌కారం అందిస్తున్నారు.

English summary
Telugu cine persons mainly supportin YCP in AP elctions. Chandra Babu says because of KCR pressure cine actors going to ycp. But cine artists also not supporting Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X