గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిశంబర్ 6న టీడీపీ ప్రధాన కార్యాలయం ప్రారంబోత్సం...ఆహ్వాన లేఖలు పంపిణ చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీలో తెలుగు దేశం పార్టీ నిర్మించిన నూతన కార్యాలయాన్ని డిసెంబర్ 6న ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రారంబోత్సవానికి రావాల్సిందిగా పార్టీ అధినేత చంద్రాబాబు నాయుడు స్వయంగా ఆహ్వాన లేఖలు పంపారు. ఉదయం 10 గంటలకు పార్టీ కార్య‌క‌ర్త‌లు,నాయ‌కులు, అభిమానుల మ‌ధ్య అంగ‌రంగ‌వైభ‌వంగా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నామని, ప్ర‌తీ ఒక్క‌రూ కుటుంబ సమేతంగా హాజ‌రై,ఈ శుభ‌సంద‌ర్భంలో పాలుపంచుకోవాల‌ని ఆహ్వానంలో పేర్కోన్నారు.

మంగళగిరిలో టీడీపీ పార్టీ కార్యాలయం

మంగళగిరిలో టీడీపీ పార్టీ కార్యాలయం

ఏపీలో తెలుగు దేశం పార్టీ నిర్మించిన నూతన కార్యాలయ నిర్మాణం పూర్తయింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో చేపట్టిన పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి అయింది. పార్టీ అవసరాల కోసం, మూడు బ్లాకులుగా సౌకర్యవంతంగా కార్యాలయం డిజైన్ చేశారు. ముందుగా ఒక బ్లాక్ ను సిద్దం చేసి...పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ నుంచి నిర్వహించనున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో మొత్తం రెండున్నర లక్షల ఘనపుటడుగుల విస్తీర్ణంలో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మాణాలు చేపట్టింది.

అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందుల్లో టీడీపీ

అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందుల్లో టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం కొల్పోయిన తర్వాత టీడీపీ పార్టీపరంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు కొంత ఇబ్బందిగా మారింది. అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తన ఇంటితో పాటు ప్రజావేదికలో నిర్వహించేవారు. ఇక అధికారం కల్పోవడంతో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాకలాపాల కోసం ప్రజావేదికను ఇవ్వాలని కోరగా అందుకు ప్రభుత్వం నిరాకరించి దాన్ని పూర్తిగా కూల్చి వేసింది.

అన్ని హంగులతో మంగళగిరి కార్యాలయం

అన్ని హంగులతో మంగళగిరి కార్యాలయం

దీంతో గుంటూరులోని పార్టీ కార్యాలయం నుండే చంద్రబాబు పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే కొంత స్థలం ఇబ్బందిగా ఉండడం, రవాణాకు కూడ ఇబ్బందులు ఉండడంతో మంగళగిరి కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలోనే నిర్మాణాన్ని మొదటి బ్లాక్ పూర్తి చేశారు. ఇక పార్టీ కార్యాలయం కోసం టీడీపీ హయాంలోనే భూమిని లీజుకు తీసుకుంది. మొత్తం మీద పార్టీ కార్యాలయం చాల సౌకర్యవంతంగా ఉండనుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న కార్యాలయం హైవేకు అనుకుని ఉండడం, విజయవాడ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాల సౌకర్యవంతంగా ఉండనుంది.

English summary
Telugu Desam Party office will be opend at 10 am on December 6th,Party chief Chandrababu Naidu himself invites party activist to attend the inauguration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X