వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్షుడి వేటలో టీడీపీ: రేసులో ముందంజలో ఉన్న నెల్లూరు బీసీ నేత: ఆ ఎంపీకి తెలుగు యువత

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రశాఖ అధ్యక్షుడి వేటలో ఉంది. పార్టీ రాష్ట్రశాఖ పగ్గాలను ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఆరా తీస్తోంది. పార్టీ కీలక నాయకుల అభిప్రాయాలను సేకరిస్తోంది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడికే అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన అగ్ర నాయకత్వం..సమర్థుడైన నాయకుడి కోసం జల్లెడ పడుతోంది. పలు పేర్లు ముందుకు రావడంతో వాటిని మళ్లీ వడపోయబోతోంది.

జగన్‌కు పార్టీపై పట్టు తప్పుతోందా?: వైసీపీలో కాంగ్రెస్ తరహా ప్రజాస్వామ్యం: అసమ్మతి గళంజగన్‌కు పార్టీపై పట్టు తప్పుతోందా?: వైసీపీలో కాంగ్రెస్ తరహా ప్రజాస్వామ్యం: అసమ్మతి గళం

 తెలుగు యువత కూడా..

తెలుగు యువత కూడా..

అదే సమయంలో కొంతకాలంగా ఖాళీగా ఉంటోన్న పార్టీ అనుబంధ విభాగం తెలుగు యువత అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేయబోతోంది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని కూడా ఎంపిక చేసిన తరువాత.. ఒకేసారి వారి పేర్లను ప్రకటిస్తారనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఇదివరకు దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన టీడీపీకి రాజీనామా చేసి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంటోంది.

 యువ బీసీ నేత కోసం..

యువ బీసీ నేత కోసం..

ప్రస్తుతం సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కళా వెంకట్రావు టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో మరొక బీసీ నాయకుడినే ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. మొన్నటి డిజిటల్ మహానాడులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సారి యువనేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ దిశగా పలువురు నాయకుల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది.

బీసీలు దూరం అయ్యారంటూ

బీసీలు దూరం అయ్యారంటూ

పార్టీకి బీసీలు దూరం అయ్యారని సాక్షాత్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా వెల్లడించారు. డిజిటల్ మహానాడు వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. బీసీ ఓటుబ్యాంకును మళ్లీ ఆకట్టుకోవడానికి చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని. దూకుడు వైఖరిని ప్రదర్శించగల నాయకుడు పార్టీ రాష్ట్రశాఖకు సారథ్యాన్ని వహించాల్సి ఉంటుందని చంద్రబాబు అప్పట్లోనే ఓ స్పష్టమైన సంకేతాన్ని పంపించారు.

 ఫ్రంట్ రన్నర్‌గా బీదా రవిచంద్ర

ఫ్రంట్ రన్నర్‌గా బీదా రవిచంద్ర

నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్‌కు పేరు బలంగా వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళా వెంకట్రావు బీసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడే అయినప్పటికీ, దూకుడుగా వ్యవహరించలేకపోయారని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీసీలను ఆయన ప్రభావితం చేయలేకపోయారనే భావన చంద్రబాబులో వ్యక్తమౌతోందని అంటున్నారు. ఈ సారి యువకుడికే పగ్గాలు అప్పగించడం ద్వారా యువతను ప్రోత్సహించినట్టవుతుందని, ఈ దిశగా బీద రవిచంద్రకు అవకాశాన్ని ఇవ్వాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

 వైసీపీలో బీద మస్తాన్ రావు

వైసీపీలో బీద మస్తాన్ రావు

బీద రవిచంద్రకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని పూర్తిస్థాయిలో పార్టీ కోసం వినియోగించుకోవచ్చని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌రావు పార్టీని వీడారు. అధికార వైఎస్ఆర్సీపీలో చేరారు. అయినప్పటికీ.. రవిచంద్ర మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా దీన్ని భావిస్తున్నారు.

తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం రామ్మోహన్ నాయుడి పేరు

తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం రామ్మోహన్ నాయుడి పేరు

తెలుగు యువత అధ్యక్ష పదవిని శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి ఇవ్వాలనే అభిప్రాయాలు ఉన్నాయి. తండ్రి ఎర్రన్నాయుడి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన పార్టీపై తనదంటూ ఓ ముద్ర వేశారని, ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని తట్టుకుని శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించడమే ఆయనకు ఉన్న పట్టును సూచిస్తోందని అంటున్నారు.

Recommended Video

Jr NTR Fans Vs Meera Chopra : Meera Chopra Files A Case Against Jr NTR Fans
లోక్‌సభలో వాగ్ధాటితో

లోక్‌సభలో వాగ్ధాటితో

రాజకీయ దురంధరులు, హేమాహేమీలు ఉన్న లోక్‌సభలో యువనేతగా మంచి ప్రదర్శన కనిపరుస్తున్నారని, వాగ్దాటితో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారనే అభిప్రాయం ఉంది. కింజరాపు కుటుంబ నేపథ్యం కూడా పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. ఆయనకు తెలుగుయువత బాధ్యతలు అప్పగిస్తే, కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువకులు పార్టీ వైపు ఆకర్షితులవుతారన్న అంచనా, పార్టీ నాయకత్వంలో కనిపిస్తోంది.

English summary
Telugu Desam Party top leaders is searching for State New President candidate. TDP top cadre leaders likely to pick up Party president candidate from BC leaders. Beeda Ravichandra Yadav and and some other leaders in the race. But, Beeda Ravichandra Yadav is front runner in the race.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X