మావోల చేతిలో తెలుగు ఇంజనీర్ హతం: కిడ్నాప్ అయిన 2 రోజులకు..

Subscribe to Oneindia Telugu

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ నెల 14న కిడ్నాప్ చేసిన ఇంజనీర్ బాలనాగేశ్వర రావును దారుణంగా హత్య చేశారు.

రెండు రోజుల క్రితం సుకుమా జిల్లా పైదగూడ దగ్గర ఇంజినీర్‌ బాలనాగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు కార్మికులని కిడ్నాప్‌ చేశారు. అయితే కిడ్నాప్ చేసిన కార్మికులను అదే రోజు విడిచిపెట్టినప్పటికీ బాలనాగేశ్వరరావును మాత్రం విడిచిపెట్టలేదు.

Maoist

సోమవారం బాలనాగేశ్వరరావును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారన్న వార్త వెలుగుచూసింది. కాగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలనాగేశ్వరరావు సుకుమాజిల్లా పాయిదాగూడవద్ద రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఆయన మరణవార్త తెలియడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bala Nageshwara Rao, An engineer working in Chhattisgarh was killed by Maoists on Monday.Earlier, he kidnapped by maoists two days back

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి