వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్... తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఊహించని ప్రకటన...

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ తగిలింది. సినీ ఇండస్ట్రీకి ప్రాతినిద్యం వహిస్తున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) నుంచి ఆయనకు మద్దతు కరువైంది. పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని... ఆ వ్యాఖ్యలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సంవత్సరాలుగా ప్రభుత్వాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని... వారి మద్దతు లేకుండా చిత్రపరిశ్రమ మనుగడ సాధ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నారాయణదాస్ నారంగ్ పేరిట ప్రకటన వెలువడింది.

ప్రభుత్వాల సహకారం లేకుండా కష్టం : టీఎఫ్‌సీసీ

ప్రభుత్వాల సహకారం లేకుండా కష్టం : టీఎఫ్‌సీసీ

'తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే.. రెండు రాష్ట్రాల్లో సినీ ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ ఇండస్ట్రీకి సహకారం అందుతూనే ఉంది. ప్రభుత్వాల సహకారం లేకుండా మేం మనుగడ సాగించలేం. ఇండస్ట్రీపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమయంలో మాకు నేతలు, ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇండస్ట్రీకి రెండు కళ్లు వంటి వారు. సినీ ఇండస్ట్రీకి వారి ఆశీస్సులు, మద్దతును కోరుకుంటున్నాం.గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు.' అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

సీఎం జగన్ హామీకి కృతజ్ఞతలు: టీఎఫ్‌సీసీ

సీఎం జగన్ హామీకి కృతజ్ఞతలు: టీఎఫ్‌సీసీ

'గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు.మన తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కారణంగా ఇతర సమస్యల రాష్ట్ర విభజన తాకిడికి గురైన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితి కారణంగా, మా పరిశ్రమ అత్యంత దయనీయ మైన పరిస్థితిలో ఉంది. వివిధ వ్యక్తులు తమ అభిప్రాయాలను మరియు ఆవేదనను వివిధ వేదికలపై వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ యొక్క అభిప్రాయం కాదు. మా పరిశ్రమ అపెక్స్ బాడీ రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పునరుద్ఘాటించాలనుకుంటున్నాము. సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నాయి. వారి మద్దతు లేకుండా చిత్ర పరిశ్రమ మనుగడ సాగించలేము.' తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.

Recommended Video

Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || Oneindia Telugu
పవన్‌కు గట్టి షాక్ : టీఎఫ్‌సీసీ

పవన్‌కు గట్టి షాక్ : టీఎఫ్‌సీసీ

'చిత్రపరిశ్రమపై ఆధారపడిన వేలాది మంది ప్రజలు, వారి కుటుంబాలు మార్చి 2020 నుండి బాధపడుతున్నారు. ఈ తరుణంలో మన నాయకులు, ప్రభుత్వాలు పెద్ద మనసుతో వారి నిరంతర మద్దతును అందించడానికి చిత్ర పరిశ్రమకు మద్దతు అవసరం.ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మన చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు. మా గౌరవనీయ ముఖ్యమంత్రులు ఇద్దరూ చురుగ్గా ఉన్నారు వారి ప్రోత్సాహం మరియు మద్దతు ఎల్లప్పుడూ మాకు అందించారు. వారి నిరంతర దీవెనలు మరియు మద్దతు కోరుతున్నాం.'తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన ఈ ప్రకటనతో పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఎదురైనట్లయింది.రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మొత్తం చిత్రపరిశ్రమ తరుపున పవన్ వకల్తా పుచ్చుకుని మాట్లాడగా... తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మాత్రం పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని తేల్చేసింది.

English summary
The Telugu Film Chamber of Commerce has clarified that the comments made by Pawan are completely personal ... they have nothing to do with those comments. Governments have been supporting them for years ... without their support the film industry cannot survive. An announcement to this effect has been made in the name of Telugu Film Chamber of Commerce Narayanadas Narang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X