కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సౌదీలొ సీమ మ‌హిళ వీర గాథ‌.. క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం కోసం పోరాడి గెలిచిన క‌డ‌ప బిడ్డ

|
Google Oneindia TeluguNews

క‌డ‌ప బిడ్డ‌..ఎడారి గ‌డ్డ పైన మ‌హిళా శ‌క్తి చాటింది. చేతిలో చిల్లి గ‌వ్వ లేదు. తెలియ‌ని దేశంలో ఎవ‌రో సూచ‌న మేర‌కు ప‌నికి చేరింది. రెండేళ్లు ప‌ని చేసినా చిల్లి గ‌వ్వ ఇవ్వ‌లేదు. న్యాయ పోరాటానికి దిగింది. భార‌త అధికారులు అండ‌గా నిలిచారు. అక్క‌డి చట్టం పైన అవ‌గాహ‌న పెంచుకుంది. తుది కంటూ పోరాటం చేసింది. ఫ‌లితంగా సౌదీ షేక్ పైన గెలిచింది. ప్ర‌తిఫ‌లం ద‌క్కించుకుంది.

క‌డ‌ప మ‌హిళ విజ‌య గాధ‌..
క‌డ‌ప జిల్లాకు చెందిన దిన్నెపాడు ల‌క్ష్మీదేవి పొట్ట‌కూటి కోసం గ‌ల్ప్‌కు వెళ్లింది. ప‌రిచయం ఉన్న వారి ద్వారా సౌదీ లోని జుబేల్‌కు వ‌చ్చింది. అక్క‌డ అర‌బ్బు ఇంట్లో ప‌నికి చేరింది. ఆనాటి నుండి య‌జ‌మాని ఎలాంటి వేత‌నం ఇవ్వ‌కుండా ఆమెతో చాకిరీ చేయించుకున్నాడు. అయితే, త‌న‌కు రావాల్సిన వేత‌నాన్ని ఇప్పించి త‌న‌న‌ను తిరిగి స్వ‌దేశానికి పంపాల‌ని 10 నెల‌ల క్రితం ల‌క్ష్మీదేవి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ కేసును అక్క‌డ ఇళ్ల‌ల్లో ప‌నిచేసే మ‌హిళ‌ల విభాగం గా పిలిచే హౌస్ మెయిడ్ల‌కు బ‌దిలీ చేసారు. ల‌క్ష్మీదేవిని షెల్టర్ కోసం సౌదీ ప్ర‌భుత్వం నిర్వ‌హించే హౌస్‌కు పంపారు. అక్క‌డ ఉన్న భార‌త రాయ‌బార అధికారుల సాయంతో ల‌క్ష్మీ న్యాయ‌స్థానం ఆశ్ర‌యించింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయం పైన కోర్టులో కేసు దాఖ‌లు చేసింది.

Telugu Lady Successful fight against Saudi Shaikh : Kadapa lady won at last..

చివ‌రి గెలుపు వ‌ర‌కు పోరాటం..
కోర్టులో కేసు దాఖ‌లు చేసినా..అంత త్వ‌ర‌గా న్యాయం జ‌ర‌గలేదు. కోర్టు విచార‌ణ‌కు య‌జ‌మాని హాజ‌రు కాలేదు. దీంతో కోర్టు ల‌క్ష్మీదేవికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా య‌జ‌మాని కోర్టు తీర్పును సైతం అమ‌లు చేయ‌లేదు. ఇక‌, లాభం లేద‌ని భావించిన ఆమె ఉన్న‌త న్యాయ స్థానంను ఆశ్ర‌యించింది. అక్క‌డ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు అమ‌లు చేసేలా చూడాల‌ని అభ్య‌ర్దించింది. అక్క‌డి ఉన్నత న్యాయ‌స్థానం కేసును ప‌రిశీలించిన త‌రువాత య‌జ‌మాని బ్యాంకు ఖాతాల‌తో పాటు అన్ని సేవ‌లను ఫ్రీజ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో..ఇక తప్ప‌ని ప‌రిస్థితుల్లో య‌జ‌మాని ల‌క్ష్మీకి బకాయి ప‌డిన 18వేల రియాళ్ల‌ను చెల్లించ‌క తప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీని ద్వారా రెండేళ్ల జీతం కింద ఈ మొత్తం ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. ఇలా..పౌరుషాల గ‌డ్డ నుండి వెళ్లిన క‌డ‌ప బిడ్డ ఎడారి షేక్‌ల అడ్డా కాదు.. తాము పోరాటంలో తీసిపోమ‌నే విధంగా మ‌హిళా శ‌క్తిని చాటి చెప్పింది. త‌న‌కు రావాల్సిన మొత్తాన్ని ద‌క్కించుకొని స్వదేశానికి బ‌య‌లు దేరింది.

English summary
Telugu lady form Kadapa dist fought for her wages in soudi against Shaik. She worked with him for 24 months. But, he did not pay single rupee for her. Then She approached court and after long arguments she got total 24 months wages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X