హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగోడి ఆవిష్కరణ: వైపైతో మొబైల్ చార్జింగ్..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైపై సౌకర్యంతో మొబైల్ ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు అతి త్వరలో రానుంది. సాధారణంగా వైపై ఉంటే ల్యాప్‌టాప్‌ముందో కూర్చోకుండా హాయిగా ఏ సోఫాలోనో, మంచమ్మీదో పడుకుని మొబైల్‌లో నెట్‌ బ్రౌజ్‌ చేస్తుంటారు.

కానీ, రాబోయే రోజుల్లో వైపైతో ఇంకో ఉపయోగం కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అదేంటంటే వైఫై చార్జింగ్. శ్యామ్‌ గొల్లకోట అనే తెలుగు ఇంజనీర్‌ నేతృత్వంలో అమెరికన్‌ ఇంజనీర్లు కొందరు కలిసి ఇటీవలే ‘యాంబియంట్‌ బ్యాక్‌స్కాటర్‌' అనే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు.

telugu software engineer developed wifi with mobile charging

‘యాంబియంట్‌ బ్యాక్‌స్కాటర్‌' అంటే వైఫై సిగ్నల్స్‌ను విద్యుత్‌ సంకేతాలుగా మార్చే టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేకించి ప్రదేశాల్లో రూటర్లను అమర్చుతారు. ఈ రూటర్లను ‘పొవైఫై'గా వ్యవహరిస్తున్నారు.

పొవైఫై అంటే పవర్‌ వైఫై అని అర్థం. దీని సాయంతో రాబోయే రోజుల్లో మైబైల్స్‌కు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువగా వాడటంతో మొబైల్‌కి ఛార్జింగ్ ఎక్కువగా అవసరం అవుతుంది.

English summary
telugu software engineer developed wifi with mobile charging.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X