వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు యువకుడు పాకిస్థాన్ లో అరెస్ట్: గుగూల్ లో గర్ల్ ఫ్రెండ్ ను వెతుక్కుంటూ: ఉగ్రదాడులకు వచ్చారంటూ.

|
Google Oneindia TeluguNews

తెలుగు యువకుడు పాకిస్థాన్ లో అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తన్న ప్రశాంత్ ప్రస్తుతం పాకిస్తాన్ బలగాల చేతిలో బందీగా ఉన్నాడు. అతడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్‌ను ఆ దేశ భద్రతాబలగాలు అరెస్టు చేసినట్లు పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది. పాక్‌లోని బహావల్‌పూర్‌ వద్ద కొలిస్థాన్‌ ఎడారిలో వీరిని అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి వద్ద ఎలాంటి పాస్‌పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌కు ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ఓ యువతి కోసం వెతుక్కుంటూ.. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించాడని చెబుతున్నారు. అయితే, ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్‌ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోందని సమాచారం. వీరిద్దరూ ఆ దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నారని పాకిస్తాన్ మీడియా వారి పైన అభియోగాలు పాకిస్థాన్‌ మీడియా లో ప్రసారం అవుతున్నాయి. రాయబార కార్యాలయాలతో సంప్రదింపులకు అవకాశం ఇవ్వటం లేదు. దీని పైన కేంద్ర ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది.

పాకిస్థాన్ బలగాల అదుపులో తెలుగు యువకుడు

పాకిస్థాన్ బలగాల అదుపులో తెలుగు యువకుడు

ఏపీలోని విశాఖ కు చెందిన ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ప్రశాంత్ ఒక యువతిని ఆన్ లైన్ లో పరిచయం అయిన యువతి కోసం దేశ సరిహద్దులు దాటినట్లు తెలుస్తోంది. తాను కలవాలని భావించిన యువతని వెతుక్కుంటూ.. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించాడని తెలిసింది. అయితే, అతడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్‌ను ఆ దేశ భద్రతాబలగాలు అరెస్టు చేసినట్లు పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది.వీరి వద్ద ఎలాంటి పాస్‌పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్‌ మీడియా చెబుతోంది. వీరిద్దరూ ఆ దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నారనే అభియోగాలు తెర మీదకు వస్తున్నాయి. అయితే, ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన వీడియో ఒకటి పాకిస్తాన్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వీడియోలో ప్రశాంత్ ఏం చెప్పారు..

వీడియోలో ప్రశాంత్ ఏం చెప్పారు..

ప్రశాంత్ పాకిస్థాన్ బలగాల చేతిలో బందీ అయిన తరువత ఒక వీడియో విడుదల అయింది. అందులో తెలుగులో మాట్లాడిన ప్రశాంత్..మమ్మి.. డాడీ.. బాగున్నారా? ఇక్కడ అంతా బాగుంది. ఇప్పు డు నన్ను పోలీ్‌సస్టేషన్‌ నుంచి కోర్టుకు తెచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందిస్తారు. అప్పుడు మీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇంకో నెల రోజుల్లో విడుదల కావొచ్చు. ఖైదీల పరస్పర మార్పిడిలో భాగంగా నన్ను భారత్‌కు పంపుతారని ప్రశాంత్‌ ఆ వీడియోలో వివరించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ వీడియో రెండేళ్ల కిందటిదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ప్రేమ విఫలంతోనే...మానసికంగా ఇలా..

ప్రేమ విఫలంతోనే...మానసికంగా ఇలా..

ప్రశాంత్‌ స్వస్థలం విశాఖపట్నం అని గుర్తించినట్లు తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. అతడు రెండేళ్ల క్రితమే పాక్‌ భూభాగంలోకి అడుగు పెట్టాడని తెలిపారు. ప్రేమ విఫలమవ్వడంతో మతిస్థిమితం కోల్పోయిన ప్రశాంత్‌.. అటూఇటూ తిరుగుతూ.. ఎడారి మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్లాడని వివరించారు. అప్పుడే అతడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. అయితే, ప్రశాంత్ కుటుంబ సభ్యులు సైతం రెండేళ్లుగా ప్రశాంత్ తాను ప్రేమించిన అమ్మాయి విషయంలో వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అప్పటి నుండి ప్రశాంత్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని..ఇప్పుడు పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న తమ కుమారుడిని విడిపించాలని ప్రశాంత్ తండ్రి కేంద్రాన్ని కోరుతున్నారు.

రాయబార కార్యాలయానికి సమాచారం లేకుండా..

రాయబార కార్యాలయానికి సమాచారం లేకుండా..

ప్రశాంత్ ను ఇప్పటి వరకు పాకిస్థాన్ లోని భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లలేదు. అదే సమయంలో రాయబార కార్యాలయంతో యాక్సెస కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో..భారత విదేశాంగ శాఖ ఈ విషయం పైన పూర్తి సమాచారం సేకరించే పని మొదలు పెట్టింది. తెలంగాణ పోలీసు అధికారుల నుండి సమాచారం సేకరిస్తున్నట్లుగా సమాచారం. అటు ఏపీ..తెలంగాణ ప్రభత్వాలు సైతం అసలు ఈ ప్రశాంత: వ్యవహారం ఏంటనే దాని పైన ఆరా తీస్తున్నారు. అదే సమయంలో విదేశాంగ వ్యవహారా శాఖ పాక్ లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా.. జాతీయ స్థాయిలోనే చర్చనీయాంశంగా మారింది.

English summary
A sfotware engineer from telugu state is now control of Pak forces. He crossed boarder in Kolisthan desert. Indian foreign affairs concentrated on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X