విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ: విజయవాడ కేంద్రంగా: అదే అజెండా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ..తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశం కానున్నారు. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ భేటీ జరుగుతోంది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తన మరి కొంత మంది కీలక శాఖల అధికారులతో కలిసి విజయవాడ వస్తున్నారు. వారితో ఏపీ సీఎస్ నీలం సాహ్నితో పాటుగా ఏపీ అధికారులు సమావేశం కానున్నారు. అందులో ప్రధనంగా షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజనపై చర్చించనున్నారు. ఆస్తుల విభజన విషయంలో సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలపై.. సీఎస్‌ల భేటీలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. వెలగపూడి సచివాలయంలో సీఎస్‌ల భేటీ జరిగే అవకాశం ఉంది.

ఇద్దరు సీఎస్ ల సమావేశం..

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సుదీర్ఘ సమావేశం తరువాత..ఏపీ..తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశం అవుతున్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా 9,10 షెడ్యూల్ ఆస్తుల పంపకాల పైన ఇప్పటి వరకు పరిష్కారం కాని అంశాల పైన చర్చకు వచ్చింది. అందులో ప్రధానంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ ఆస్తుల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీలో ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో కార్మికుల ఆస్పత్రి...కళ్యాణ మండపం తో సహా ఇతర భవనాల పంపకాల మీద చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయిన విద్యుత్ ఉద్యోగుల అంశం పైన ఇద్దరు సీఎస్ లు చర్చించే అవకాశం ఉంది. దీని పైన కమిటీ వేసినా..ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అశం పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Telugu states Chief secreteries meet to day in Viajaywada to discuss pending issues

సీఎంల అదేశాల మేరకు..వియవాడలో

ఏపీ ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వారిద్దరి మధ్య చర్చల సమయంలోనే పరిష్కారం కాని అంశాల మీద చర్చకు వచ్చింది. అక్కడి నుండే ఇద్దరు సీఎంలు తమ సీఎస్ లకు ఫోన్ చేసి వెంటనే ఇద్దరూ సమావేశం కావాలని సూచించారు. దీంతో..తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన టీంతో విజయవాడకు వస్తున్నారు.

అక్కడే ఈ కీలక భేటీ జరగనుండి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అధికారులు ఏపీకి వచ్చి రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పైన చర్చించటం ఇదే తొలి సారి. ఇక, ఈ సమావేశంలో ప్రధానంగా 9, 10 షెడ్యూల్ సంస్థల పైన ఇప్పటికే షీలా బీడీ కమిటీ ఇచ్చిన నివేదిక..సిఫార్సుల పైన అధ్యయనం చేసి..పరిష్కారం కాని వాటి పైన తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రులకు నివేదించనున్నారు.

English summary
Both telugu states Chief secreteries meet to day in Viajaywada to discuss on 9th and 10th schedule issues between two states. AP and Telagana CM's directed both CS's to meet on pending matters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X