• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేపే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ - ఫిర్యాదులతో జగన్‌, కేసీఆర్‌ రెడీ - హాట్‌హాట్‌గా సాగే అవకాశం

|

ఏపీ, తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహిస్తోంది. వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌తో పాటు ఇరు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టాక మొదలైన ఈ వివాదాల పర్వం ప్రస్తుతం తారా స్దాయికి చేరింది. ఇరు రాష్ట్రాలు కూడా పొరుగు ప్రభుత్వాలపై అక్రమ ప్రాజెక్టుల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ హాట్‌హాట్‌గా సాగనున్నట్లు తెలుస్తోంది.

అపెక్స్‌ భేటీకి సర్వం సిద్ధం...

అపెక్స్‌ భేటీకి సర్వం సిద్ధం...

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై చర్చించేందుకు కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ భేటీని రేపు ఉదయం నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారు. ఆయనతో పాటు జలవనరులశాఖ ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉంటారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి అపెక్స్‌ భేటీలో తమ అధికారులతో కలిసి పాల్గొంటారు. తెలంగాణ కోణంలో చూస్తే కృష్ణానదిపై ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రధాన అభ్యంతరంగా కనిపిస్తోంది. ఏపీ మాత్రం గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణా నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులపై ఇప్పటికే ఆయా నదీ యజమాన్య బోర్డులకు ఇచ్చిన అభ్యంతరాలను తిరిగి ప్రస్తావించబోతోంది.

ఇరు రాష్ట్రాల ఉమ్మడి వాదనలివే..

ఇరు రాష్ట్రాల ఉమ్మడి వాదనలివే..

ఏపీ విభజన తర్వాత ఏర్పాటైన తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని కేంద్రం నిర్ణయించడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇరు రాష్ట్రాలు ఈ రెండు బోర్డుల పరిధి నిర్ణయించడం కానీ, లేదా తమ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులపై తమకే అధికారం కట్టబెట్టడం కానీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ పవర్ హౌస్‌ పై నియంత్రణ తెలంగాణకూ, కుడి ప్రధాన కాలువపై నియంత్రణ ఏపీకి కేంద్రం అప్పగించింది. ఇదే తరహాలో తమ పరిధిలో ఉన్న వాటిపై నియంత్రణ తమకే ఇవ్వాలని ఆయా రాష్ట్రాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. విభజన చట్టం ప్రకారం ఎవరి భూభూగంలో ఉన్న ప్రాజెక్టులపై అయినా ఆయా బోర్డుల నియంత్రణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీటి భద్రత కోసం కేంద్రం నుంచి సీఐఎస్‌ఎప్‌ బలగాలను కూడా తీసుకోవచ్చు. కానీ ఇది ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ వాదన ఇదే...

ఆంధ్రప్రదేశ్‌ వాదన ఇదే...

నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువపై నియంత్రణను తమకు అప్పగించాలని ఏపీ కోరుతోంది. దీనిపై కృష్ణా రివర్‌ బోర్డును అధికారం అప్పగించడం లేదా తమకే నియంత్రణ ఇవ్వడం ఏదో ఒకటి చేయాలని కేంద్రాన్ని కోరబోతోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ సర్కారు కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలో ప్రత్యేక అజెండా ఏమీ లేకపోయినా గతంలో అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయించిన అజెండాకే కట్టుబడాలని జగన్ సర్కారు నిర్ణయించింది. 2015లో ఏపీ, తెలంగాణ మధ్య కుదిరిన నీటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాజెక్టులకు 113.04 టీఎంసీల నీరు తీసుకోవచ్చు. ప్రస్తుతం రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా ఈ మొత్తాన్నే తీసుకుంటామని ఏపీ చెబుతోంది. అయినా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌లో ప్రస్తావించేందుకు ఏపీ సిద్ధమైంది.

  #Watch YS Jagan Claps For AP Grama Sachivalayam Volunteers | Oneindia Telugu
  తెలంగాణ వాదన ఇదీ..

  తెలంగాణ వాదన ఇదీ..

  ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం తమ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని తెలంగాణ వాదిస్తోంది. రాయలసీమ లిఫ్ట్‌ నిర్మిస్తే శ్రీశైతం ప్రాజెక్టు నుంచి అవసరాల మేరకు ఏపీ ప్రభుత్వం నీటిని తీసుకుటుందని, ఇది తమ రైతుల నోట్లో మట్టికొట్టడమే అని కేసీఆర్‌ సర్కారు వాదిస్తోంది. ఎట్టి పరిస్దితుల్లోనూ రాయలసీమ లిఫ్ట్‌కు అంగీకరించబోమని సీఎం కేసీఆర్‌ చెబుతున్నారు. మిగతా ప్రాజెక్టులపైనా చిన్నా చితకా అభ్యంతరాలున్నా ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్‌పైనే కేసీఆర్‌ అపెక్స్‌ భేటీలో పట్టుబట్టే అవకాశముంది. అలాగే గోదావరిపై తాము నిర్మిస్తున్న కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలకు కౌంటర్‌ ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది.

  English summary
  andhra pradesh and telangana chief ministers ys jaganmohan reddy and k.chandra sekhara rao is ready with their arguments for proposed apex council meeting on water disputes tomorrow.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X