వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వాళ్లపై దాడులొద్దు, మన రాష్ట్రంలో ఇంత దారుణమా: కన్నడ దాడిపై జగన్

కర్నాటకలో తెలుగు విద్యార్థులపై, ఉద్యోగులపై దాడి జరిగిన నేపథ్యంలో వైసిపి అధినేత వైయస్ జగన్ స్పందించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

కన్నడ దాడిపై జగన్ : మా వాళ్లపై దాడులొద్దు, మన రాష్ట్రంలో ఇంత దారుణమా

అమరావతి/హైదరాబాద్: కర్నాటకలో తెలుగు విద్యార్థులపై, ఉద్యోగులపై దాడి జరిగిన నేపథ్యంలో వైసిపి అధినేత వైయస్ జగన్ స్పందించారు.

దాడులు జరగకుండా చూడాలి

దాడులు జరగకుండా చూడాలి

ఈ దాడులు జరగకుండా చూడాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వైయస్ జగన్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు జరగకుండా చూడాలని కన్నడ ప్రభుత్వాన్ని కోరారు.

మళ్లీ జరగొద్దు

మళ్లీ జరగొద్దు

తెలుగు ఉద్యోగార్థులపై కర్ణాటకలో దాడులు శోచనీయమని, వారి భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దుస్థితిపై ఆవేదన

తెలుగు రాష్ట్రాల్లో దుస్థితిపై ఆవేదన

అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ముందుకుసాగాలని జగన్ ఆకాంక్షించారు. మరోవైపు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇంత పెద్ద సంఖ్యలో యువత వెళ్తున్న తీరు - మన రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను తెలియజేస్తోందని, దీనిపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నానని తన ప్రకటనలో జగన్ అన్నారు.

పరీక్ష రాయని వారికి శుభవార్త!

పరీక్ష రాయని వారికి శుభవార్త!

ఇదిలా ఉండగా, కర్నాటకలో ఐబీపీఎస్ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు ఉద్యోగార్థులపై కన్నడ సంఘాలు, కన్నడ విద్యార్థి సంఘాలు దౌర్జన్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. కాగా, కర్నాటకలో తెలుగు విద్యార్థులపై జరిగిన దాడులు, వీరంగం అడ్డగింతలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు కర్నాటక ప్రభుత్వ అధికారులతో చర్చించారు. పరీక్ష రాయని విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ఐబీపీఎస్‌ను కోరింది.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Sunday responded on telugu students attacked in Karnataka on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X