వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధ‌మ‌వుతున్న తెలుగు స్వామీజీ??

|
Google Oneindia TeluguNews

భ‌గ‌వంతుడిపై అన‌న్య ప్రేమ‌ను పెంపొందించుకొని వైకుంఠానికి చేరుకొని మ‌హావిష్ణువు పాదాల‌చెంత విశ్రాంతి తీసుకోవ‌డానికి సాధుపురుషులు, స‌త్పురుషులు ప్ర‌య‌త్నం చేస్తుంటారు. దీనికోసం త‌మ జీవితం మొత్తాన్ని త్యాగం చేస్తారు. జీవిత‌కాలం కృషిచేసినా ల‌భిస్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు. ఆధ్యాత్మిక జీవితం రెండువైపులా ప‌దునున్న క‌త్తివాద‌ర‌వ‌లే ఉంటుంది. ఈవైపుగా ప‌య‌నించాల‌నుకునేవారికి భౌతిక జీవితం దుర్భ‌రంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో మాయా మోహాల‌ను ఛేదించుకోవాల‌ని సామాన్య ప్ర‌జ‌ల‌కు బోధించేవారే ఆ మాయా మోహాల‌కు బ‌ద్ధుల‌వుతున్నారు. వ్యామోహాల్లో చిక్కుకుపోతున్నారు.

 రాజకీయ వైకుంఠపాళి

రాజకీయ వైకుంఠపాళి


వైకుంఠానికి చేరుకోవ‌డానికి బదులు రాజ‌కీయ వైకుంఠపాళిలో నిచ్చెన‌లెక్కుతున్నారు.. కింద ప‌డిపోతున్నారు. తాజాగా కోస్తా జిల్లాల‌కు చెందిన‌ స్వామీజీ ఒక‌రు లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌డానికి పావులు క‌దుపుతున్నారు. ఇందుకోసం ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో యోగి ఆదిత్య‌నాథ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌ట్లుగా స‌న్యాసులు కూడా రాజ‌కీయాల్లోకి రావ‌డంలో త‌ప్పేంలేద‌నేది స‌ద‌రు స్వామీజీ అభిప్రాయంగా ఉంది.

 మధ్యప్రదేశ్ అయితే గెలుపు సులభమని..

మధ్యప్రదేశ్ అయితే గెలుపు సులభమని..

భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌ల‌తో మొద‌టి నుంచి స‌న్నిహితంగా మెలుగుతుంటారు. ఎప్ప‌టినుంచో ఈ ఆలోచ‌న ఉన్న‌ప్ప‌టికీ దీర్ఘ‌కాలికంగా ఆశ్ర‌మం భ‌విష్య‌త్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఆయ‌న బీజేపీవైపు మొగ్గుచూపారు. ఏపీలో పార్టీకి అంత బ‌లం లేక‌పోవ‌డంతో లోక్‌స‌భ‌లో అడుగుపెట్టాలంటే పార్టీ బ‌లంగా ఉన్న రాష్ట్రం కావాలి. ఇప్పుడు ఆయ‌న చూపు మ‌ధ్య‌ప్ర‌దేశ్ పై ప‌డింది. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అక్క‌డ ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌ని త‌ల‌పోస్తున్నారు.

 ఢిల్లీలో ఖరీదైన ప్రాంతంలో స్థలం కొనుగోలు?

ఢిల్లీలో ఖరీదైన ప్రాంతంలో స్థలం కొనుగోలు?


భ‌విష్య‌త్తులో కార్యాల‌యం అవ‌స‌ర‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో స్థ‌లాన్ని కొనుగోలు చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏపీ, హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే కార్యాల‌యాలున్నాయి. త్వ‌ర‌లో ఢిల్లీలో కూడా కార్యాల‌యాన్ని ప్రారంభించ‌బోతున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎక్కడో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారని దేశవ్యాప్తంగా ఆశ్రమాలు, పీఠాలు నడిపే సాధువులకు కూడా రాజకీయం మీద ఆసక్తి కలుగుతుండటం విచిత్రంగా అనిపిస్తోంది. ఈ మాయా మోహాన్ని ఛేదించుకొని వైకుంఠానికి చేరుకుంటారా? లేదంటే రాజకీయమనే మోహానికి ఆకర్షితులై రాజకీయ వైకుంఠపాళిలో పాము నోట్లో పడతారా? అనేది కాలమే నిర్ణయించాలి.!!

English summary
According to Mr. Swamiji, there is no wrong in entering politics like Yogi Adityanath took the post of Chief Minister in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X