విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ట్విస్ట్: మలుపు తిరిగిన యాంకర్ తేజస్విని ఆత్మహత్య కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మాజీ యాంకర్ తేజస్విని కేసు లో కొత్త ట్విస్ట్

విజయవాడ: కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామపరిధిలో ఎంబీఎంఆర్ కాలనీలో మాజీ యాంకర్ తేజస్విని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామానికి చెందిన పవన్ కుమార్, తేజస్విని అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. వీరు ఇల్లు అద్దె ఇంట్లో ఉంటున్నారు.

ఏడాదిన్నర క్రితం వీరికి ఒక పాప జన్మించింది. అప్పట్నుంచీ పవన్ తల్లి వెంకట్రావమ్మ కొడుకు కోడలు వద్దే ఉంటోంది. పవన్ ఉయ్యూరులోని ఓ సంస్థలో పని చేస్తూ ఈడుపుగల్లులోని ఎంబీఎన్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. గత కొంతకాలంగా పవన్, తేజస్విని మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. గొడవలు జరుగుతుండేవి.

ఏమైంది: విజయవాడలో న్యూస్ యాంకర్ ఆత్మహత్యఏమైంది: విజయవాడలో న్యూస్ యాంకర్ ఆత్మహత్య

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు

ఇటీవల పవన్ షిరిడి వెళ్లగా తేజస్విని, ఆమె కుమార్తె, పవన్ తల్లి వెంకట్రావమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో వెంకట్రావమ్మ కోడలును పిలిచేందుకు ఆమె గది వద్దకు వెళ్ళింది. ఎంత పిలిచినా కోడలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు సాయంతో తలుపు పగలగొట్టి చూడగా తేజస్విని గదిలో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేశారు.

సూసైడ్ నోట్ లభించడంతో సెక్షన్లు మార్పు

సూసైడ్ నోట్ లభించడంతో సెక్షన్లు మార్పు

ఆమె గతంలో విజయవాడలోని ఓ ప్రయివేటు ఛానల్‌లో యాంకర్‌గా‌ పనిచేశారు. ఆమె వయస్సు 25 ఏళ్లు. ఇదిలా ఉండగా, తేజస్విని ఆత్మహత్య కేసు మలుపు తిరుగుతోంది. పోలీసులు తొలుత సెక్షన్‌ 174 నమోదు చేశారని తెలుస్తోంది. రెండు రోజుల తర్వాత సూసైడ్‌ నోట్‌ దొరకడంతో కేసును సెక్షన్‌ 498, 306కు మార్పు చేశారు.

విజయవాడలో అంత్యక్రియలు

విజయవాడలో అంత్యక్రియలు

తేజస్విని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా సెక్షన్‌ 174 కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లి ఎం.వెంకటరమణమ్మ తీసుకెళ్లేందుకు నిరాకరించింది. విజయవాడలోనే తేజస్విని మృత దేహానికి భర్త పవన్‌ కుమార్‌ దహన సంస్కారాలు నిర్వహించారు.

అందుకే సెక్షన్ మార్పులు

అందుకే సెక్షన్ మార్పులు

తేజస్విని ఆత్మహత్య కేసులో పలు కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. తేజస్విని మృతదేహం వద్ద సూసైట్‌ నోటు లభించిందని, అందులో భర్త వరకట్న వేధింపులు కారణంగా ఉందని తెలుస్తోంది. దీంతో సెక్షన్‌ 498, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్‌ 306గా మార్పు చేసినట్లుగా తెలుస్తోంది.

English summary
A former television anchor committed suicide in Andhra Pradesh's Krishna district, allegedly due to marital discord. M. Tejaswini, 25, ended her life by hanging herself at her house at Edupugallu on Sunday. The incident came to light on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X