వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పుడితే ఈ అత్తకు అల్లుడిగానే..నెట్టింట తెలుగు మహిళకు జేజేలు..కొత్త అల్లుడి కోసం 67రకాల వంటకాలు.

|
Google Oneindia TeluguNews

''మళ్లీ జన్మంటూ ఉంటే కచ్చితంగా ఇండియాలో.. అది కూడా ఈవిడకు అల్లుడిగానే పుడతా..'' ఓ విదేశీయుడి కామెంట్. ''ఏంటి బాబు.. ఆ అల్లుడుగారు కుంభకర్ణుడా? లేక బకాసురుడా?'' లోకల్ నెటిజన్ వ్యంగ్యాస్త్రం. ''ఇది మరీ అన్యాయం.. కొత్త అల్లుణ్ని ఇంతగా పాంపర్ చేయాలా? కూతుర్ని ఏలుకోడని భయమా? ఇంకా ఎప్పటికి మారుతుంది మన సమాజం?'' అంటూ ఓ యువతి విసుర్తు.. ''ఎన్నైనా చెప్పండి.. ఆ అల్లుడు కచ్చితంగా లక్కీ ఫెలోనే.. ఇందో సందేహమేలేదు..'' అని మిగతా వాళ్ల వ్యాఖ్యలు.. ఇదంతా ఏంటంటే..

సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్

ఓ తెలుగు మహిళ.. కొత్తగా పెళ్లైన తన కూతురు, అల్లుడు ఇంటికి వస్తోన్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఏకంగా 67 రకాల వంటకాలతో 5కోర్స్ మీల్స్ సిద్ధం చేసింది. అల్లుడు అలా ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ''రండి రండి రండి.. దయ చేయండి.. ''పాటతో ఆహ్వానిస్తానని, ముందుగా వెల్కమ్ డ్రింక్, తర్వాత స్టార్టప్, ఆ తర్వాత మెయిన్ కోర్స్, చివరికి డెజర్ట్.. ఇలా తీరొక్క రుచుల్ని తినిపిస్తానంటూ ఓ వీడియో రూపొందించింది.

Telugu Woman cooks 67-item 5-course meal for son-in-law, video gone viral

అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎక్కడుంటారు? అనే వివరాల కోసం నెటిజన్లు శోధిస్తున్నారు.

మాట తీరునుబట్టి ఆమె పొరుగురాష్ట్రంలో ఉంటోన్న తెలుగు మహళ అయిఉండొచ్చని తెలుస్తోంది. అల్లుడిపై ఇంత గొప్పగా అభిమానాన్ని చాటుకున్న ఆమెను ''మదర్ ఇన్ లా ఆఫ్ ది నేషన్''గా ప్రకటించాలని, ఆమె ఆదరణ పొందిన అల్లుడికి ''సన్ ఇన్ లా ఆఫ్ ది నేషన్''బిరుదు యాప్ట్ అవుతుందని ఇంకొందరు కామెంటారు.

English summary
A Telugu woman made an exotic meal for her son-in-law to pamper him. She cooked a five-course lunch with 67 items. The meal included welcome drinks, starters, chaat, main course and desserts. netizens ask how will he do justice to all that food
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X