వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కూతురు కిడ్నాప్, ప్రత్యర్థులేనని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam leader Bilya Naik’s daughter missing
హైదరాబాద్/నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతావత్ బిల్యా నాయక్ కూతురు హారిక (12) గురువారం హైదరాబాద్‌లోని బిఎన్‌రెడ్డి నగర్‌లో కిడ్నాప్‌కు గురైంది. గురువారం ఉదయం ఇంట్లోని వరండాలో చదువుకుంటున్న హారిక కనిపించకపోవడంతో కిడ్నాప్‌కు గురయ్యిందని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. టిడిపి అభ్యర్థి బిల్యా నాయక్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు హైదరాబాదులోని బిఎన్ నగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. హారిక ఎనిమిదో తరగతి చదువుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం బిల్యా నాయక్, ఆయన భార్య అనిత దేవరకొండలో ఉన్నారు.

గురువారం ఉదయం నుంచి హారిక కనిపించక పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయాన్ని దేవరకొండలో ఉన్న బిల్యాకు తెలిపారు. ఆయన హుటాహుటినా హైదరాబాద్ వచ్చారు. తన కుమార్తెను అపహరించారని మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్యా స్వస్థలం చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రశాంతపురి తండా

సార్వత్రిక ఎన్నికల బరిలో ఉన్న తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఓర్వలేక తన కుమార్తెను ప్రత్యర్థులే అపహరించారని బిల్యా నాయక్ ఆరోపించారు. గతంలో తన పైన రెండుసార్లు దాడులు జరిగాయన్నారు. తన కుమార్తెను వారే అపహరించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

English summary

 Nalgonda district president of Telugu Desam, Bilya Naik’s 14-year-old daughter went missing on Thursday from her relative’s house in Meerpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X