వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోళ్ళు పగిలే ఎండలు ... తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు నిప్పులే .. జరభద్రం

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ లోనూ , తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు ఎండలు దంచికొట్టనున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు భయంకరంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ, అలాగే విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించాయి. తెలంగాణాలో నేడు, రేపు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది . ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా నిప్పుల వర్షమే కురిసినంత ఎండ తీవ్రత ఉంటుందని జర భద్రం అని వాతావరణ శాఖ పేర్కొంది .

 కొత్తగూడెంలో 46.8, గన్నవరంలో 47.4: తెలుగురాష్ట్రాల్లో ఠారెత్తిస్తోన్న ఎండలు, వడగాలులు కూడా.. కొత్తగూడెంలో 46.8, గన్నవరంలో 47.4: తెలుగురాష్ట్రాల్లో ఠారెత్తిస్తోన్న ఎండలు, వడగాలులు కూడా..

ఏపీలో మరో రెండు మూడు రోజుల పాటు వడగాలులు

ఏపీలో మరో రెండు మూడు రోజుల పాటు వడగాలులు

రోహిణీ కార్తి కావటంతో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వేడిగాలులు, విపరీతమైన ఉక్కపోత కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు చోట్ల ఎండ తీవ్రంగా ఉంటుందని , బాగా ఎండ సమయాల్లో బయట తిరగవద్దని తెలిపింది. రాయలసీమలో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అలాగే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

 అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచన

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచన

అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది . ఇలా ఉండగా ఉపరితల ద్రోణి,ఆవర్తనం కారణంగా మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది .అయినా తగిన జాగ్రత్తలు అవసరం అని హెచ్చరించింది .

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు

ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా మరో రెండు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల,వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబా బాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది .

 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు .. 27న బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు

46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు .. 27న బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు

ఇక తెలంగాణలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో వడగాడ్పులతో జనజీవనం ఇబ్బంది పడింది . విపరీతమైన ఎండల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రోళ్ళు పగిలే ఎండలు కాస్తున్న నేపధ్యంలో ఎండ సమయంలో బయటకు వెళ్ళకుండా ఉంటేనే మంచిదని చెప్తుంది వాతావరణ శాఖ .
మరోవైపు ఈ నెల 27న బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక అంతేకాదు ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్‌ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. ఏది ఏమైనా మరో రెండు, మూడు రోజుల పాటు ప్రజలు ఎండల నుండి తమను తాము రక్షించుకోవాలని చెప్పారు వాతావరణ శాఖాధికారులు .

English summary
In Andhra pradesh and Telangana, sunny days from today. Daytime temperatures are likely to rise, according to the Hyderabad Meteorological Department and also vishkha Meteorological center .The meteorological department has warned that due to heavy hot winds in Telangana today and tomorrow there is a possibility of heavy rainfall. The Andhra Pradesh weather forecast says that the Temperatures to soar across telugu states .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X