గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో...రణరంగంలా మారిన గుంటూరు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

Recommended Video

అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో...రణరంగంలా మారిన గుంటూరు

గుంటూరు:మంగళవారం రాత్రి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు పోలీసులకు లొంగిపోవడంతో అతడిని తమకి అప్పగించాలంటూ బాధిత బాలిక తరుపు బంధువులు పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు.

పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రెచ్చిపోయిన సమూహం పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి తరిమికొట్టారు. దీంతో అర్భన్ ఎస్పీ విజయారావు స్టేషన్ వద్దకు చేరుకొని పరిస్థితి సద్దుమణిగేందుకు కృషి చేశారు.

ఘటన...పూర్వాపరాలు

ఘటన...పూర్వాపరాలు

పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని నందివెలుగు రోడ్డులో ఉన్న రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికను పక్క ఫ్లాటులో ఉంటున్న బొందిలి రఘురామ్‌ (19) అనే యువకుడు అపార్ట్‌మెంట్‌ పైకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ బాలిక ఏడుస్తూ కిందకు రావడంతో చుట్టుపక్కలవారు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీనితో తన విషయం బైటపడిపోయిందని తెలిసిన నిందితుడు తనపై దాడి జరుగుతుందని భావించి నేరుగా పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ విషయం తెలిసి బాధిత బాలిక తల్లిదండ్రులు ఘటన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలిక బంధువులు, సామాజికవర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

 నిందితుడిని అప్పగించాలని...ఆందోళన

నిందితుడిని అప్పగించాలని...ఆందోళన

స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బాధిత బాలిక తరుపు జనం నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితుడిని మీరైనా చంపండి...లేదంటే మాకు అప్పగించండి...మేమైనా చంపేస్తామంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను వెళ్లిపోవాలని హెచ్చరించడంతో కోపోద్రిక్తులైన జనాలు పోలీస్‌ స్టేషన్‌పై దాడికి దిగగా పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులతో పాటు స్టేషన్ పై రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్ అద్దాలు, పోలీసు వాహనాలు,ఫైరింజన్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి.

నచ్చజెప్పేందుకు...నేతల ప్రయత్నాలు

నచ్చజెప్పేందుకు...నేతల ప్రయత్నాలు

ఉద్రిక్తత విషయం తెలుసుకున్న మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎం జియావుద్దీన్‌, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎండీ హిదాయత్‌, టీడీపీ నేతలు షేక్‌ షౌకత్‌, సామాజిక వర్గం మత పెద్దలు స్టేషన్‌కు చేరుకుని బాధితురాలి తరుపున పోలీసులతో చర్చలు జరిపారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం నేతలు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఆందోళనకారులు మరోసారి పోలీసు స్టేషన్‌ సమీపంలో మెయిన్‌ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు మళ్లీ లాఠిఛార్జి చేసి వారిని తరిమికొట్టారు.

 భారీగా ట్రాఫిక్ జామ్...సంఘవిద్రోహ శక్తుల పనా?

భారీగా ట్రాఫిక్ జామ్...సంఘవిద్రోహ శక్తుల పనా?

ఈ ఘటనల పరంపర కారణంగా గుంటూరు-తెనాలి,చీరాల,రేపల్లె మార్గంలో ప్రయాణించే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో సుమారు 5 గంటల పాటు వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అయితే పోలీసులు పరిస్థితి ఇంతగా అదుపుతప్పడానికి ఆందోళనకారుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు రంగ ప్రవేశం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
వారివల్లే స్టేషన్‌ వద్ద పరిస్థితులు హింసాత్మకంగా మారడానికి, అనంతరం అల్లర్లు చెలరేగి ఉండొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి దాటేవరకు పాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనే ఉండటంతో ఈ ఘటనల పర్యవసానాలు బుధవారం కొనసాగుతాయేమోననే అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

సిఎం సమీక్ష...అధికారులకు ఆదేశాలు

సిఎం సమీక్ష...అధికారులకు ఆదేశాలు

మరోవైపు పాత గుంటూరు దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బుధవారం ఉదయం ఈ విషయమై సీఎస్, డిజిపి,ఇంటలిజెన్స్ అధికారులతో సీఎం సమావేశం నిర్వహించిటెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గుంటూరు ఘటనలో బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలినవారికి బుద్ది వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయన్న ఇంగితం పెరగాలన్నారు. అలాగే అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అశాంతి, అభద్రత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తానని సీఎం ఈ సందర్భంగా హెచ్చరించారు.

గుంటూరులో...144 సెక్షన్

గుంటూరులో...144 సెక్షన్

గుంటూరులో బాలిక అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పై ఆందోళనకారుల దాడుల నేపథ్యంలో మొత్తం 22మంది పోలీసులకు గాయాలైనట్లు గుర్తించారు. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. స్టేషన్ పక్కనే ఉన్న పాత వాహనాలు 50 వరకు అగ్నికి ఆహుతైనట్లు తెలిసింది. ఈ సంఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు వివరాలు ఆరా తీస్తున్నారు.

బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులతో ఆయన మాట్లాడుతున్నట్టు తెలిసింది. మళ్లీ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు గుంటూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. అనుమంతులు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పై దాడి జరిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

English summary
Guntur:Massive public outrage and tension prevail after the incident in which a eight-year-old girl was allegedly molested by a young man at Old Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X