వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత.. అనుమతి కోసం 1500 మంది మత్స్యకారుల నిరీక్షణ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీలోకి వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వివిధ కారణాలతో తోచిన మార్గాల్లో ఏదోలా సరిహద్దులకు చేరుకుంటున్న వీరు.. పోలీసులు అనుమతించకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. తాజాగా ఇవాళ ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో చిక్కుకుపోయిన 1500 మంది మత్స్యకారుల పరిస్దితి కూడా ఇదే.

 లాక్ డౌన్ పట్టని జనం- సరిహద్దులకు..

లాక్ డౌన్ పట్టని జనం- సరిహద్దులకు..

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రాల సరిహద్దుల్లోకి జనం రాక పెరుగుతోంది. ఏదో ఒక కారణంతో స్వస్ధలాలకు చేరుకోవాలన్న తపనతో సరిహద్దులకు చేరుకుంటున్న జనం అక్కడ అనుమతులు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సొంత ప్రజలే అయినా రాష్ట్రంలోకి విచ్చలవిడిగా అనుమతించేందుకు ఇప్పుడు ఏ రాష్ట్రం కూడా సిద్ధంగా లేదు. దీంతో రాష్ట్రాల సరిహద్దులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

 ఇవాళ ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో

ఇవాళ ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో


కర్ణాటకలోని మంగుళూరు పోర్టువద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల నుంచి 1500 మంది మత్స్య కార్మికులు కొన్నిరోజుల క్రితం వెళ్లారు. అయితే దేశంలో కరోనా ప్రభావం పెరిగి లాక్ డౌన్ విధించడంతో వీరికి ఉపాధి కరవైంది. దీంతో వీరు మంగళూరు పోర్టు నుంచి రోడ్డు మార్గంలో అడ్డంకులు దాటుకుంటూ ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు వద్ద నున్న కర్నాటక సరిహద్దు చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నారు.
అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీకి చెందిన కార్మికులను వీరి కాంట్రాక్టర్ సరిహద్దులోనే వదిలివెళ్లినట్లు తెలుస్తోంది.

పోలీసులతో వాగ్వాదం- ఉద్రిక్తత..

పోలీసులతో వాగ్వాదం- ఉద్రిక్తత..

కర్నాటక సరిహద్దులకు చేరుకున్న వీరంతా ఏపీలోని తమ స్వస్ధలాలకు వెళ్లేందుకు అనుమతించాని పోలీసులను కోరుతున్నారు. అయితే పోలీసులు మాత్రం నిబంధనల ప్రకారం వీరిని రాష్ట్రంలో అనుమతించలేమని స్పష్టం చేశారు. దీంతో కర్నాటక సరిహద్దులోనే 1500 మంది మత్స్యకారులు ఎదురుచూసే పరిస్దితి. ఉదయం నుంచి అక్కడే ఉన్న వీరంతా ఓ దశలో సహనం నశించిపోయి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు నిబంధనల పేరుతో వీరిని పట్టించుకోకపోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. అయితే కర్నాటక-ఏపీ ప్రభుత్వాల అధికారులు వీరి విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. క్వారంటైన్ కు అంగీకరించే వారినే ఏపీలోకి అనుమతించే అవకాశాలున్నాయి.

English summary
once again tension looms in andhra-karanataka border as poice denied permission to ap's fishermen into the state. 1500 fishermen gone for mangalore port in karnataka for works have returned amid fears of coronavirus but ap police stopped them at karnataka border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X