వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మచిలీ పట్నంలో ఉద్రిక్తత ..మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇసుక కొరత వేధిస్తోంది. జగన్ కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ ఇసుక మాత్రం అందడం లేదు. దీంతో భవన నిర్మాణ కార్మికులు వద్దు లేక రోడ్డున పడుతున్నారు. ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మొన్నటికి మొన్న కన్నా లక్ష్మీనారాయణ ఇసుక కొరత పై నిప్పులు చెరిగారు. మరోమారు ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఇక తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎపి బీజేపీ నేతలు తక్షణమే రాజీనామా చేయాలి:మంత్రి కొల్లు;ఐటి దాడులు ఎదుర్కొనేందుకు సిద్దం:కేశినేనిఎపి బీజేపీ నేతలు తక్షణమే రాజీనామా చేయాలి:మంత్రి కొల్లు;ఐటి దాడులు ఎదుర్కొనేందుకు సిద్దం:కేశినేని

ఇసుక కొరత పై దీక్షకు సిద్ధమైన కొల్లు రవీంద్రకు పోటీగా వైసీపీ నేతలు టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని దీక్షకు సిద్ధం అయ్యారు. దీంతో కోళ్ళు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంతో మచిలీపట్నంలో టెన్షన్ నెలకొంది. ముందుగా కొల్లు రవీంద్రను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే వేరే మార్గంలో కోనేరుసెంటరు కొల్లు రవీంద్ర చేరుకున్నారు అక్కడ ఆయనను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను అక్కడి నుండి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కొల్లు రవీంద్ర అరెస్టు నేపథ్యంలో టిడిపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ తోపులాట జరిగింది.

Tension in machilipatnam .. formenr minister kollu ravindra arrest

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొల్లు రవీంద్ర ను అరెస్ట్ చేశారు. అంతకుముందు కొల్లు రవీంద్ర చేపట్టిన నిరసన దీక్షకు వెళ్లకుండా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుని కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. డిఆర్సి సమావేశం ఉన్నకారణంగా ఆందోళనలకు ర్యాలీలకుఅనుమతులు లేవని, అటు వైసిపి నాయకులు గానీ టిడిపి నాయకులు గానీ అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా సహించేది లేదని అడిషనల్ ఎస్పీ సత్తిబాబు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

English summary
Tension prevails at Machilipatnam in Krishna district with YSRCP, and TDP leaders are protesting on the sand issue. The TDP leaders led a protest on the shortage of the sand while YSRCP held protests against opposition party's wicked tack Ticks. However, police say they have not been given permission. The police have arrested former minister and TDP leader Kollu Ravindra. Police have ruined a 36-hour deeksha at the Koneru Center in Machilipatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X