• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీ నేతకు చెందిన మూడు ఇళ్ళు ధ్వంసం ..నెల్లూరులో ఉద్రిక్తత

|

ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కక్షలు , కార్పణ్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దాడులు జరుగుతున్నాయి. ప్రజలు తన్నుకు చస్తున్నారు. ఒకరి మీద ఒకరు పగ తీర్చుకుంటున్నారు. ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి గత తొమ్మిదేళ్లుగా టీడీపీ పాలనలో అణచివేతకు గురయ్యామని ఫీల్ అయిన నాయకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. విచక్షణా రహితంగా దాడులు చెయ్యటమే కాదు అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నాయకుల ఇళ్ళను, పార్టీ కార్యాలయాలను కూల్చివేయటం లో బిజీగా ఉన్నారు. దీంతో తాజా ఆందోళన కర పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించిన 48 గంటల్లోనే నెల్లూరు టీడీపీ నేత ఇంటిని అధికారులు కూల్చేవేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

వివేక్ మొదలెట్టేశాడు .. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటంలో కేసీఆర్ దే కీలక పాత్రట!!

అక్రమ నిర్మాణాలని కూచివేశామని చెప్తున్న అధికారులు .. ఆందోళనలో తెలుగు తమ్ముళ్ళు

అక్రమ నిర్మాణాలని కూచివేశామని చెప్తున్న అధికారులు .. ఆందోళనలో తెలుగు తమ్ముళ్ళు

నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో నివసిస్తున్న తెలుగుదేశం నేత జహీర్ అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారంటూ అధికారులు ఆయన ఇంటిని కూల్చివేశారు. సమాచారం అందుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇది కక్ష సాధింపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అనుమతి లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణం అని చెప్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్షసాధింపులకు దిగుతోందని మండిపడ్డారు తెలుగు తమ్ముళ్ళు . ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో ఈ క్రమంలో తెలుగుదేశం నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నెల్లూరులో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

వైసీపీకి ఓటు వెయ్యకుంటే ఇల్లు కూలుస్తారా అని ఆగ్రహం .. ఉద్రిక్తత , పోలీసుల మోహరింపు

వైసీపీకి ఓటు వెయ్యకుంటే ఇల్లు కూలుస్తారా అని ఆగ్రహం .. ఉద్రిక్తత , పోలీసుల మోహరింపు

ఇక జనార్దన్ కాలనీలో మాజీ కార్పొరేటర్ సల్మా జహీర్‌కు చెందిన మూడు ఇళ్లను అధికారులు కూల్చి వేసిన ఘటన తెలుగు తమ్ముళ్ళను ఆగ్రహానికి గురి చేస్తుంది. వైసీపీకి ఓటు వెయ్యనంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా అంటూ మండిపడుతున్నారు. దీంతో నేటి తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పర్యవేక్షిస్తున్న నెల్లూరు ఆర్డీవో చిన్నికృష్ణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. . కాలనీలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు విధించారు.

 చంద్రబాబు స్పందించిన 48 గంటలు కాక ముందే కూల్చివేతలు ..

చంద్రబాబు స్పందించిన 48 గంటలు కాక ముందే కూల్చివేతలు ..

ఇక నెల్లూరు లో కూల్చివేతలపై చంద్రబాబు స్పందించి 48 గంటలు కూడా కాకముందే ఈ ఘటన జరిగింది. మొన్న ఈ కూల్చివేతలపై స్పందించిన చంద్రబాబు నెల్లూరుజిల్లా వెంకటేశ్వరపురం, జనార్ధనరెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా కార్యకర్తల ఇళ్ళు కూలుస్తున్నారు. కేవలం వైకాపాకి ఓటు వేయలేదన్న కారణంతో తెదేపా సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకోవడం గర్హనీయం. ఇకనైనా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటూ ట్వీట్ చేశారు . ఇలా దాడులు చెయ్యటం , కూల్చివేతలకు పాల్పడటం హేయమని పేర్కొన్నారు. ఇళ్ళ కూల్చివేతలు, దాడులు తప్ప ప్రభుత్వం ఇంకేమీ చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే జగన్ సర్కార్ మాత్రం అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేసి చూపించింది.

English summary
Zaheer, the Telugu Desam leader who lives in Venkateswarapuram in Nellore city, houses were demolished by the authorities. TDP leaders who got the information reached the spot and got into an argument with the authorities. They allege that this was a factional conspiracy. Two days before Chandrababu says the anarchic rule in the AP is continuing. Targeting tdp sympathizers is unacceptable because they simply did not vote for ycp. Yet we warn the government to stop such undemocratic actions. Tweeted. Chandrababu, he wants to prevent any further acts of anarchism, said that the attacks were a shame.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more