వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో టెన్షన్ .. వైసీపీ నేతలకు టచ్ లో టీడీపీ కీలక నేతలు?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : వైసీపీ నేతలకు టచ్ లో టీడీపీ కీలక నేతలు? || Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజేత ఎవరనే విషయం మరి కొద్దిగంటల్లో తేలిపోనుంది . దీంతో ఏపీలో ఉత్కంఠకు తెరపడనుంది. ఒక పక్క ఎగ్జిట్ పోల్స్ టీడీపీ ఎగ్జిట్ అవుతుందని తేల్చేశాయి. దీంతో వైసీపీ శిబిరంలో సంతోషం టీడీపీ శిబిరంలో టెన్షన్ నెలకొంది. టీడీపీ నుండి జంప్ జిలానీల దృష్టి వైసీపీ మీద పడటంతో టీడీపీ లో ఆందోళన నెలకొంది.

జాతీయ నేతల చుట్టూ తిరిగే దుస్థితి చంద్రబాబుకు వచ్చింది దాడి వీరభద్రరావు ఫైర్జాతీయ నేతల చుట్టూ తిరిగే దుస్థితి చంద్రబాబుకు వచ్చింది దాడి వీరభద్రరావు ఫైర్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో టీడీపీకి తలనొప్పి ... వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ నేతలు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో టీడీపీకి తలనొప్పి ... వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ నేతలు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత కూడా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ విజయం తమదంటే తమదంటూ ధీమాను ప్రదర్శిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతామని చెబుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఇక తాజా పరిణామాలు టీడీపీకి ప్రతికూలంగా మారటంతోతెలుగుదేశం పార్టీకి కొందరు అభ్యర్థులు, ముఖ్య నేతలు భారీ షాక్ ఇవ్వబోతున్నారనే వార్త తాజాగా బయటకు వచ్చింది .

టీడీపీ నుండి పోటీ చేసిన 23 మంది వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం

టీడీపీ నుండి పోటీ చేసిన 23 మంది వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం

ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఎగ్జాక్ట్ పోల్స్ కు మరికొన్ని గంటలే సమయం ఉంది . ఇదే సమయంలో వైసీపీ విజయం సాధిస్తుంది అని వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సరి కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశాయి. ఏపీలో విజయం వైసీపీదే అని భావిస్తున్న కొందరు టీడీపీ నేతలు ముందు జాగ్రత్తలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన 23 మంది అభ్యర్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని ఏపీలో ప్రచారం జోరుగా జరుగుతోంది. వీరిలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలతో పాటు ఓ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరితో జిల్లాలోని నేతలతో పాటు వైసీపీలోని కీలక నేత ఒకరు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీలోని కొందరు నేతలు ముందుగానే వైసీపీ నేతలతో మంతనాలు జరిపారనే వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రస్తుతం టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది.

టీడీపీ అధికారంలోకి రాకుంటే ప్రత్యామ్నాయం దిశగా నేతల అడుగులు

టీడీపీ అధికారంలోకి రాకుంటే ప్రత్యామ్నాయం దిశగా నేతల అడుగులు

వాస్తవానికి ఎన్నికలకు ముందే వీళ్లంతా వైసీపీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారని అయితే.. అప్పుడు వీలు కాకపోవడంతో ఆగిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనే కారణంతోనే వీళ్లంతా తమ దారి తాము చూసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని, విజయం టీడీపీదేనని చెప్పినా కూడా టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తటం ఆగటం లేదు. అందుకే టీడీపీ పరిస్థితి ఒకవేళ ఎగ్జిట్ ఫలితాలలో చెప్పినట్టే వస్తే ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చే వైసీపీ లోకి జంప్ అవ్వటానికి ఎవరికి వారు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

English summary
Exit polls have come out. There are a few more hours for the exact polls. At the same time, the exit polls that the YCP will succeed is well established for new political equations. At present senario 23 candidates who are contesting for Telugu Desam Party are in touch with YSR Congress Party leaders. In the backdrop, the news that some leaders in TDP had negotiated with the YCP leaders became a hot topic in the state. It is currently worrying in TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X