హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత .. 2 వారాల క్వారంటైన్ తర్వాతే అనుమతిస్తామన్న ఏపీ డీజీపీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక అన్ని రాష్ట్రాలు దీనిని కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలలో సైతం కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాల కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు . అయితే ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుండే కాదు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు ఏపీకి తరలివస్తున్నారు. హైదరబాద్ లో గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో దీంతో బోర్డర్ లోనే ఎపీకి వస్తున్న వాళ్ళను అడ్డుకుంటున్నారు పోలీసులు. దీంతో బోర్డర్ లో టెన్షన్ నెలకొంది. ఇక ఈ అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవంగ్ కీలక వ్యాఖలు చేశారు.

సరిహద్దు గందరగోళం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ .. తెలంగాణా సర్కార్ పై అసహనంసరిహద్దు గందరగోళం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ .. తెలంగాణా సర్కార్ పై అసహనం

ప్రధాని మోడీ లాక్ డౌన్ విజ్ఞప్తిని గుర్తు చేసిన ఏపీ డీజీపీ

ప్రధాని మోడీ లాక్ డౌన్ విజ్ఞప్తిని గుర్తు చేసిన ఏపీ డీజీపీ

తెలంగాణా రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువ . ఇక హైదరాబాద్ లో హాస్టళ్ళు మూసివేసి వారికి ఎన్ఓసి ఇచ్చి మరీ ఎపీకి పంపారు. అయితే బోర్డర్ లో వారిని ఆపుతున్న ఏపీ పోలీసులు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు . ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తు గా ప్రకటించింది అని గుర్తు చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎక్కడివారు అక్కడే ఉండాల్సిందిగా, కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని దేశ ప్రధాని, ముఖ్యమంత్రి చేతులు జోడించి మరీ కోరారని చెప్పారు .

 నిబంధనలకు విరుద్ధంగా అనుమతించం

నిబంధనలకు విరుద్ధంగా అనుమతించం


ఇప్పటికే ఏపీ సర్కార్ బోర్డర్ లను మూసివేస్తూ ప్రకటన చేసిన నేపధ్యంలో నిన్నటి నుండి కొందరు నిబంధనలకు విరుద్దంగా ఆంధ్ర ప్రదేశ్ లోనికి రావడానికి ప్రయత్నిస్తూ సరిహద్దు తనిఖీ కేంద్రాల దగ్గరకు వచ్చి ఉన్నారు. వెళ్ళనివ్వమని ప్రాధేయపడుతున్నారు. అయితే తాము వారిని నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోనికి అనుమతించేది లేదు అని స్పష్టం చేశారు ఏపీ డీజీపీ .

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
రెండు వారాల పాటు క్వారంటైన్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి

రెండు వారాల పాటు క్వారంటైన్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి

ఏపీ బోర్డర్ వద్దకు వచ్చిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా రెండు వారాలపాటు క్యారంటైన్ లో ఉండాలని , ఆ తరువాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని చెప్తున్నారు ఏపీ డీజీపీ. లాక్ డౌన్ ఉదేశ్యం ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అంటు వ్యాధి సంక్రమించకండా ఉండేలాగా చేయడమే అని ఆయన పేర్కొన్నారు. బయట నుండి ఆంధ్ర ప్రదేశ్ లోనికి అనుమతి ఇవ్వటం అంటే మన లాక్ డౌన్ ను నీరు గార్చటమే అని పేర్కొన్నారు ఏపీ డీజీపీ . కాబట్టి అర్ధం చేసుకోవాలని , ప్రభుత్వ నిర్ణయాన్ని నిందించటం తగదని ఏపీ డీజీపీ పేర్కొన్నారు.

English summary
They have come to border checkpoints trying to break the rules to come into Andhra Pradesh.However, the AP DGP said that they are not allowed to enter the state contrary to the rules. AP DGP said that everybody should need to quarantine for 14 days after they are helathy then we will allow them into the state .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X