వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: దూసుకొచ్చిన రైతులు: తోపులాట...లాఠీఛార్జ్...!

|
Google Oneindia TeluguNews

అమరావతి నుండి పరిపాలనా రాజధానిని తరలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది .అమరావతిని కేవలం శాసనా రాజధానిగా ఖరారు చేసింది. ఇప్పటికే 34 రోజులుగా ఈ ప్రతిపాదన..తెర మీదకు రాగానే రోడ్ల మీదకు వచ్చిన అమరావతి గ్రామాల ప్రజలు..ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయించారు. దీంతో..పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తరువాత స్థానిక మహిళలు..రైతులు మందడం పొలాల నుండి సచివాలయం వద్దకు చేరుకొనే ప్రయత్నం చేసారు.

సచివాలయం రెండు..నాలుగో గేటు వద్దకు చేరు కొనేందుకు ప్రయత్నాలు చేసారు. జాతీయ జెండాలను కప్పుకొని..పొలాల మధ్య నుండి రైతులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. చివరి నిమిషంలో వారిని గమనించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని చెదరగొట్టారు. ఆ సమయంలో పలువురు రైతులు..మహిళలు కింద పడిపోయారు. కొంతమంది పైన పోలీసులు లాఠీఛార్జ్ చేసారు.

అసెంబ్లీ ముట్టడికి స్థానికుల ప్రయత్నం..

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ముందు నుండి చెబుతున్న విధంగానే..మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లును ప్రవేశ పెట్టింది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా పరిమితం చేసింది. దీంతో.. ఈ బిల్లుపైన చర్చ సాగుతున్న సమయంలో అసెంబ్లీని ముట్టడించాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాల ను మొహరించారు. అసెంబ్లీ సాగుతున్న సమయంలోనే.. స్థానికులు పెద్ద సంఖ్యలో మందడం పొలాల్లో నుండి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. వారు అక్కడి నుండి వస్తారని అంచనా వేయలేకపోయినా పోలీసు లు చివరి నిమిషంలో అప్రమత్తప్రయ్యారు.వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసారు. మహిళలు జాతీయ జెండాలతో అక్కడకు రావటంతో..పోలీసతో వాగ్వాదం చోటు చేసుకుంది. పురుషుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. దీంతో..కొందరు రైతలు కింద పడటంతో గాయాలయ్యాయి.

Tension situation at Ap assembly..Police lathi cahrge on farmers

రైతులు వర్సెస్ పోలీసులు

ముందుగా నిర్ణయించుకున్న రైతులు...స్థానికులు బ్యాచ్ లు వారీగా అసెంబ్లీని ముట్టడించేందుకు పొలాల మధ్య నుండి బయటకు రావటం చూసి పోలీసులు అప్రమత్త మయ్యారు. పెద్ద సంఖ్యలో వారంతా అక్కడకు వస్తుండటంతో వారి పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. అసెంబ్లీ రెండు..నాలుగో గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. మహిళా పోలీసులను సైతం పెద్ద సంఖ్యలో మొహరించారు. తమను అడ్డు కుంటున్న పోలీసుల పైన స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు.

కొందరు పోలీసులకు దండం పెట్టి వేడుకుంటున్నారు. అక్కడ పెద్ద ఎత్తన స్థానికులు చేరుకోవటంతో ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను సైతం అక్కడకు తరలించారు. దీంతో..సభ లోపల చర్చ సాగుతున్న సమయంలోనే బయట పోలీసులు వర్సెస్ స్థానికులు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. అయితే, పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.

English summary
Amaravati local people and farmers reahed near to Assembly to protest govt decision on three capitals. Police controlled them and lathi charge on them. Tension created near Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X