వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: పవన్ కళ్యాణ్‌తో పోలీసుల భేటీ, రాజధానికి వెళ్తామంటూ నాగబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై జరిగిన చర్చ, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరుపై ఈ భేటీలో చర్చించారు.

జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు..

జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు..

రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటించి రైతులను, మహిళలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారన్న సమాచారంతో జనసేన కార్యాలయం చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసులు చేరుకోవడాన్ని జనసేన కార్యకర్తలు వ్యతిరేకించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

చంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గనచంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గన

పవన్ కళ్యాణ్‌తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ

పవన్ కళ్యాణ్‌తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ

ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడారు. ప్రస్తుత రాజధాని రైతుల పరామర్శ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని పవన్‌ను కోరారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం రైతులను ఇప్పుడు పరామర్శించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌‌ను ఒకవేళ రాజధాని ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది.

ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది..

ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది..

ఈ క్రమంలో జనసేన పార్టీ కీలక నేత నాగబాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతులకు సంఘీబావం తెలిపేందుకు తాము ఇక్కడికి వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం దారుణమని, ఇది ప్రభుత్వం తాలూకు పెద్ద తప్పు అని అన్నారు.

రైతులను పరామర్శిస్తామంటూ నాగబాబు

రైతులను పరామర్శిస్తామంటూ నాగబాబు


పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. తాము ఎర్రబాలెంలో పర్యటించి రైతులను, మహిళలను పరామర్శిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. తాము ఇప్పుడే వెళ్లి తీరుతామన్నారు. రైతులకు, మహిళలకు మద్దతు తెలుపుతామని అన్నారు.
మూడు రాజధానుల అసెంబ్లీ తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మరో జనసేన నేత తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రైతులను తాము పరామర్శిస్తామని అన్నారు.

జగన్ సర్కారుపై పవన్ మండిపాటు

జగన్ సర్కారుపై పవన్ మండిపాటు

తాము తీసుకునే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించుకోలేక దానిపై కేంద్రంతో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు వైఎస్ జగన్ అబద్ధాల ప్రచారంలో దొందూ-దొందే అని పవన్ ఎద్దేవా చేశారు. న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనాన్ని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌కు జత చేశారు. ఈ పత్రిక కథనంలో ఏముందంటే.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులతో పరిపాలన వికేంద్రీకరణ చేసేందుకు నిర్ణయించిన విషయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

English summary
tension situation at mangalagiri janasena office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X