ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దెందులూరు లో ఉద్రిక్త‌త : చింత‌మ‌నేని ని తోసేసిన కానిస్టేబుల్ : వైసికి కార్య‌క‌ర్త‌ల‌తో వాగ్వాదం..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల కీల‌క‌మైన పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కాక‌ముండే ఉద్రిక్త‌త‌లు చోటు చేస‌కుంటున్నాయి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా లోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి .. వైసిపి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. పోస్ట‌ల్ బ్యాలెట్ పోలింగ్ సంద‌ర్భం గా ఒక‌రి పై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. రెండు పార్టీల శ్రేణులు అక్క‌డికి చేరుకోవ‌టంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప డ్డాయి. దీంతో..పోలీసులు రంగ ప్ర‌వేశం చేసారు.

దెందులూరు లో ఉద్రిక్త‌త‌..
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఏలూరు లోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర టిడిపి... వైసిపి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. దెందులూరు నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ సందర్భంగా.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాక ర్‌ను ఓ కానిస్టేబుల్‌ తోసేశారు. వైసీపీ నాయకులు ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఈ ఘ‌ట‌న పై ఫిర్యాదు చేశారు. ఫెసిలిటేషన్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను వైసీపీ నాయకులు ప్రలోభపెడుతున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి లోనైన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి చింతమనేని రంగంలోకి దిగారు. దీం తో వివాదం మరింత ముదిరి ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

Tension situation created in Denduluru postal ballot center : TDP Vs YCP cadre fight..

తోపులాట‌..చింత‌మేని తోసివేత‌..
ఎమ్మెల్యే చింత‌మనేని అక్క‌డకు చేరుకోవ‌టంతో..ఒక్క సారిగా రెండు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు దూసుకొచ్చారు. ఈ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఒక కానిస్టేబుల్ చింతమనేనిని తోసివేయ డంతో ఆయన కింద పడబోయారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి చింతమనేని ఫిర్యాదు చేసారు. అక్కడకు చేరుకు న్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి, వారిని అక్కడ నుంచి పంపేసారు. ఈ పరిణామాలతో పోస్టల్ బ్యాలెట్ విని యోగిం చుకోవడానికి వచ్చిన ఉద్యోగులు ఆందోళన చెందారు. కాగా, దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం పై ఎన్నిక‌ల సంఘం ముందు నుండి ప్ర‌త్యేక దృష్టి సారించింది. అయితే, పోలింగ్ వేళ ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని భావించినా.. ముందుగానే ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు ,చేసుకోవ‌టంతో పోలీసులు..అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

English summary
Tension situation created in Denduluru constituency in West Godavari dist. In Elurue CR Reddy college Denduluru postal ballet polling time incident taken place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X