వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1987లో పంపిణీ చేసిన భూమే.. మరోసారి పంపిణీ యత్నం.. అదేమంటే దుశ్శాసన పర్వం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో తాము ఉంటున్న భూమిని టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ గృహకల్ప పేరుతో ఆక్రమించుకోవడాన్నిఅడ్డుకున్న ఓ దళిత మహిళను వివస్త్రను చేసి 14 దళిత కుటుంబాలపై దాడి ఘటనపై నిరసన వెల్లువెత్తింది. దీంతో గ్రామంలో పోలీసులను భారీగా మోహరించి 144 సెక్షన్‌ విధించారు. వివిధ సంఘాల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దళిత మహిళపై దుశ్శాసన పర్వానికి తెగబడ్డ టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ పాలనలో మహిళలకు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. దళితులపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేసి, జైలుకు పంపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు అప్పలనాయుడు భూదాహంతో దళితులు మానప్రాణాలకు ముప్పు వాటిల్లిందని ఆరోపించారు. దళిత మహిళపై అధికార టీడీపీ దాష్టీకానికి నిరసనగా విశాఖ డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు ఒత్తిడితో పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం, కేసు వివరాలను వెల్లడించకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఘటనాస్థలం వైపు తొంగిచూడని ఎమ్మెల్యే బండారు

ఘటనాస్థలం వైపు తొంగిచూడని ఎమ్మెల్యే బండారు

అయితే దళితులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డ సమయానికి కొద్ది నిమిషాల ముందు వరకు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కొడుకు అప్పలనాయుడు ఘటనాస్థలంలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. టీడీపీ నాయకులకు అప్పలనాయుడు ఏవో సూచనలు ఇచ్చి వెళ్లిన కొద్దిసేపటికే అతడి అనుచరులైన టీడీపీ నేతలు దళితులపై దాడికి దిగినట్లు బాధితులు తెలిపారు. దళిత మహిళపై టీడీపీ శ్రేణుల దౌర్జన్యం ఘటనను ఎమ్మెల్యే బండారు తన అధికార బలంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పలువురు నేతలు బాధితులకు బాసటగా నిలిచినా ఎమ్మెల్యే బండారు అటువైపు తొంగి కూడా చూడలేదు. మరోవైపు ఘటనాస్థలికి సమీపంలో ఉన్న మరో గ్రామంలో ఎమ్మెల్యే నిశ్చింతగా ఇంటింటి టీడీపీ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. దీంతో డీఐజీ రవికుమార్‌మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని వైస్‌ ఎంపీపీ పార్వతి, ఆమె భర్త అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులందరినీ అరెస్టు చేయాలని హర్షకుమార్‌ పట్టుబట్టారు. కాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వర్గవైషమ్యాలే ఈ వివాదానికి కారణమని చర్చ జరుగుతోంది.

ఇరు పక్షాలపై కేసుల నమోదు

ఇరు పక్షాలపై కేసుల నమోదు

బాధితురాలు దుర్గమ్మ ఫిర్యాదు మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులు బుధవారం గ్రామంలో విచారణ నిర్వహించారు. అనంతరం నిందితులు పెందుర్తి వైస్‌ ఎంపీపీ మడక పార్వతి, టీడీపీ నాయకుడు మడక అప్పలరాజు, మడక రామునాయుడు, మాజీ సర్పంచ్‌ వడిశల శ్రీను, రాపర్తి గంగరాజు, సాలాపు జోగారావు, సాలాపు గంగమ్మలను వెస్ట్‌ జోన్‌ ఏసీపీ ఎల్‌.అర్జున్, సీఐ జె.మురళిలను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. దుర్గమ్మపై దాడికి పాల్పడ్డ ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీసీపీ-2 టి.రవికుమార్‌మూర్తి విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌లో విలేకరులకు తెలిపారు. మరోవైపు నిందితుల నుంచి కూడా అందిన ఫిర్యాదు మేరకు కౌంటర్‌ కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.

రెండేళ్ల క్రితం అదే స్థలం మరోసారి ఎన్టీఆర్ పేరిట పంపిణీ

రెండేళ్ల క్రితం అదే స్థలం మరోసారి ఎన్టీఆర్ పేరిట పంపిణీ

జెర్రిపోతులపాలెం గ్రామంలోని సర్వే నంబర్‌ 77లో ఏడుగురికి 1987లో ప్రభుత్వం నాలుగైదు సెంట్లు చొప్పున డీఫారం పట్టాలు మంజూరుచేసింది. పట్టాలు పొందిన వారిలో ఒకరు మినహా మరెవ్వరూ నివాసం ఉండకపోవడంతో రద్దుచేసి రెండేళ్ల క్రితం మళ్లీ టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ గృహకల్ప పేరుతో 22 మందికి కేటాయించారు. దీంతో ఈ స్థలాన్ని గతంలో తమకు కేటాయించారని ఎస్సీ వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేయగా వారికి సగం స్థలం కేటాయించడానికి అంగీకారం కుదిరింది. తర్వాత స్థలాన్ని చదును చేసి జాబితా సిద్ధం చేయగా, అందులో దళితుల పేర్లు లేకపోవడంతో వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ క్రమంలో మరోమారు హౌసింగ్‌ పథకంలో పేర్లు ఉన్న వ్యక్తులు పనులు చేపట్టడంతో ఎస్సీ వర్గం మంగళవారం స్థానిక తహసీల్దార్‌ సుధాకర్‌నాయుడును సంప్రదించి హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెనుతిరిగింది. సాయంత్రం సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఇరువర్గాలు తోపులాటకు దిగడంతో దళిత మహిళ చీర లాగిన సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు మరో మహిళతో ఘర్షణ పడిన నేపథ్యంలో ఆమె రవిక ఊడిపోవడం, తర్వాత ఆమె గోతిలో పడిపోవడంతో వివాదం ముదిరిందని మరో కథనం వినిపిస్తున్నది.

English summary
In 1987 government land distributed poor people in Vishaka district. Recently 2 years back once again this land distributed some others. But SC women questioned organisers. Then there some stampede leads humiliation of that women. It leads to agitate locals and political parties, frontal organisations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X