గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషాదం:కన్నవారి ప్రేమ కోసం పరితపించి, చివరకిలా..

తల్లిదండ్రుల ప్రేమ కోసం చిన్నారి పరితపించాడు. మూడేళ్ళ వయస్సులోనే కిరణ్ తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు:కన్నవారి ప్రేమకోసం తల్లడిల్లిపోయాడు. చిన్నతనం నుండి కన్నప్రేమకు దూరమయ్యారు.అయితే కన్నవారి ప్రేమ కోసం పరితపించిపోయాడు అతను. కన్నవారి ప్రేమ కోసం బతికున్నంత కాలం ఎదురుచూశాడు. తల్లిదండ్రుల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

కన్నతల్లిదండ్రుల కోసం ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది.అనాథగానే తాను బతకాల్సి వస్తోందని బాధపడుతూ ఆయన ప్రాణాలను తీసుకొన్నాడు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం రాత్రి పదోతరగతి విధ్యార్థి పి.కిరణ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.

tenth class student committed suicide in guntur

కిరణ్ చాలా తెలివైన విధ్యార్థి. క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవాడు. నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాడు.అయితే తల్లిదండ్రుల ప్రేమ కోసం ఆయన పరితపించిపోయేవాడు.

తన బాధను భరిస్తూ జీవనం సాగించేవాడు. అమ్మ,నాన్న ఆదరణ లేదని ఆయన బాధపడేవాడని కిరణ్ కుమార్ స్నేహితులు చెబుతున్నారు.

మనోవేదనకు గురై ఆత్మహత్య

తోటి విధ్యార్థులతో ఎప్పుడు నవ్వుతూ ఉండే కిరణ్ కుమార్ మనసులో మాత్రం ఎప్పుడూ బాధతో ఉండేవాడు.కిరణ్ మూడేళ్ళపిల్లాడుగా ఉన్న సమయంలోనే భార్య,భర్తల మధ్య వచ్చిన గొడవల కారణంగా వారు విడిపోయారు. తండ్రి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. తల్లి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకొంది.కిరణ్ ను నాయనమ్మవద్దే వదిలేసింది. చిన్నప్పటి నుండి కిరణ్ నాయనమ్మ వద్దే పెరిగాడు.

వయస్సు పెరుగుతున్న కొద్ది కిరణ్ కుమార్ తల్లిదండ్రుల కోసం పరితపించిపోయాడు. తల్లిదండ్రులను కలవాలనే ప్రయత్నం చేశాడు సాధ్యపడలేదు. అమ్మ,నాన్న ఉండి కూడ తాను అనాధగా మారారనే ఆవేదనతో కిరణ్ ఆత్మహత్య చేసుకొన్నాడు.

పేరేంట్స్ మీటింగ్ కు ఎవరొస్తారు

పాఠశాలలో జరిగే పేరేంట్స్ మీటింగ్ ఎవరొస్తారనే ఆందోళన కిరణ్ ను వెంటాడేది.తన స్నేహితులతో ఎప్పుడూ కిరణ్ చెప్పేవాడని చెప్పారు.స్కూల్లో టీచర్లు తిట్టినా, కొట్టినా తన గురించి ఎవరు వచ్చి టీచర్లను ప్రశ్నిస్తారని కిరణ్ మధనపడేవాడని కిరణ్ స్నేహితులు చెప్పారు. ఈ విషయమై కన్నీళ్ళు పెట్టుకొనేవాడని కిరణ్ చెప్పాడు.తల్లిదండ్రుల గురించి పరితపించిపోయేవాడని చెప్పారు.

తల్లిదండ్రుల లేరనే బాధతో ఆయన కిరణ్ మంగళవారం నాడు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకొన్నాడు. కిరణ్ ఆత్మహత్యతో స్థానికంగా విషాదం నెలకొంది.

English summary
tenth class student committed suicide in guntur.kiran studying in government school at puduguralla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X