వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పదో తరగతి పరీక్షలు: జూలైలో నిర్వహణ, త్వరలో షెడ్యూల్: మంత్రి సురేశ్

|
Google Oneindia TeluguNews

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కరోనా వైరస్ వల్ల పరీక్షలు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులతోపాటు పేరంట్స్ కూడా ఆందోళన చెందడంతో టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

Recommended Video

AP 10th Class Exams in July: Education Minister Adimulapu Suresh

జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. పరీక్షల నిర్వహణ గురించి తర్వలోనే షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఎగ్జామ్ నిర్వహించే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని.. విద్యారులందరూ మాస్క్‌ ధరించాలని పేర్కొన్నారు.

tenth exams will be counduct july month: minister suresh

సాధారణంగా 2900 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామని.. కానీ ఫిజికల్ డిస్టన్స్ పాటించడం వల్ల పరీక్షా కేంద్రాలు పెరుగుతాయని చెప్పారు. ఒక్కో తరగతి గదిలో 12 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే మే నెలలో పరీక్ష నిర్వహిస్తారనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని.. అది ఫేక్ అని స్పస్టం చేశారు. అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

English summary
tenth exams will be counduct july month andhra pradesh minister adimulapu suresh said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X