వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల రైల్లో ఉగ్రవాదులు?: ఏపీలో టెన్షన్, తనిఖీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తీవ్రవాదుల కదలికల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో దాదాపు యాభై మంది వరకు ఐఎస్ఐ ఏజెంట్లు వస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమాచారం అందటంతో ఏపీ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు.

గుంటూరు జిల్లా బాపట్ల, తెనాలీ రైల్వే స్టేషన్‌లలో తనిఖీలు నిర్వహించారు. తిరుపతి, ఇతర చోట్ల నుండి వచ్చే రైళ్లలో పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన మునీర్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

Terrorists: High Alert in Andhra Pradesh

వారి వద్ద మ్యాపులు, దిక్సూచీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా రైలులో ప్రయాణించే వారి వద్ద అలాంటివి ఉండవు. కానీ వీరి వద్ద మ్యాపులు, దిక్సూచీలు ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు. వారి వద్ద మ్యాపులతో పాటు రూ.50వేలు గుర్తించారని సమాచారం. ఏపీ వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

ఏపీ ప్రభుత్వం అపర్మత్తత, తిరుమల ఎక్సుప్రెస్ 50 మంది ఐఎస్ఐ ఏజెంట్స్, బాపట్ల తెనాలి తనిఖీలు, మునీర్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏపీ వ్యాప్తంగా చెక్ పోస్టుల ఏర్పాటు, ఉగ్ర కదలితలకో ఏపీ అప్రమత్తం, వారి వద్ద మ్యాపులు, దిక్సూచి ఉన్నాయి, సాధారణంగా ప్రయత్నించే వారు అలా ఉండదు, వారు మ్యాపులు ఎందుకు తీసుకు వెళ్తున్నారు, యాభై వేల రూపాయల నగదు.

English summary
Terrorists: High Alert in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X