శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాయల టీకి వ్యతిరేకం: టిజి వెంకటేష్, వాళ్ల వల్లే: కొండ్రు

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh and Kondru
గుంటూరు/ శ్రీకాకుళం: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాను వ్యతిరేకమని కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు దారుణమని ఆయన అన్నారు. శనివారం ఉదయం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికే ఉద్యమాలతో నలిగిపోతున్న రాష్ట్రం బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో మరింత నష్టపోతుందని ఆయన అన్నారు. సున్నితమైన అంశంపై అన్ని కోణాల్లో పరిశీలించి స్పందిస్తామని మంత్రి తెలిపారు. సీమాంధ్ర రాజధాని విషయంలో భిన్న ప్రతిపాదన వల్లే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకువచ్చిందని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడి వంటి బిజెపి నాయకులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, సిపిఐ కార్యదర్శి నారాయణ తెలంగాణ ఇవ్వాలని చెప్పిన తర్వాతనే కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయని రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి అన్నారు. కేంద్రం, కాంగ్రెసు నిర్ణయాల్లో తప్పు లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

నదీజలాల సమస్యలు తలెత్తుతాయనే తాము రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. పార్టీ నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వెళ్లిపోయినా, తాను వెళ్లిపోయినా కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన నష్టం లేదని కొండ్రు మురళి అన్నారు.

English summary
Minister from Rayalaseema TG Venkatesh has oppoesed the proposal of Rayala Telangana. Minister Kondru blamed Nara Chandrababu Naidu and YS Jagan for the division of Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X