వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు రాజధానులు..టీజీ వ్యాఖ్యల వెనుక అసలు కధ : కేంద్రానికి సీఎం జగన్ నివేదించింది ఇదే..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP రాజధాని పై వ్యాక్యలు చేసిన TG వెంకటేష్ || TG Venkatesh Sensational Comments On AP Capital Issue

ఏపీలో నాలుగు రాజధానులు రాబోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు..టీడీపీ నుండి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమయ్యాయి. ఇది జగన్ ఆలోచనగా బీజేపీ ముఖ్య నేత తనతో చెప్పారని టీజీ వివరించారు. ఏపీలో భవిష్యత్ ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి జగన కేంద్రానికి నివేదించిన మాట వాస్తమేనని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. అయితే, అందులో నాలుగు రాజధానుల వ్యవహార వెనుక అసలు విషయం వారు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన పాలనలో ఏ ప్రాంతంలోని ప్రజల్లోనూ తమను పట్టించుకోవటం లేదు.. ఒకే ప్రాంతం పైన ఫోకస్ చేస్తున్నారనే అభిప్రాయం లేకుండా జగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ వ్యూహంలో భాగమే మంత్రి బొత్సా వ్యాఖ్యలుగా అర్దం అవుతోంది. ఇక, ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అయిదు ,రాజధానులు అంటూ కొత్త చర్చ తెర పైకి తీసుకొచ్చారు. దీంతో..ఇది సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. అయితే..అసలు విషయం ఏంటంటే...

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలతో కలకలం...

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలతో కలకలం...

రాయలసీమ ప్రాంతానికి చెందిన టీజీ వెంకటేషన్ తొలి నుండి రాయలసీమ హక్కుల కోసం మాట్లాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన తరువాత తన వాయిస్ ను తగ్గించారు. ఇక, తాజాగా ఆయన బీజేపేలో చేరారు. కానీ, ఆయనతో పాటు టీడీపీ నుండి బీజేపీలో చేరిన మిగిలిన ముగ్గరు ఎంపీలు యాక్టివ్ గా ఉన్నా..టీజీ మౌనంగానే ఉంటున్నారు. సడన్ గా రాజధాని గురించ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ఒక వైపు రాజధాని గురించి అనేక అంచనాలు..అపోహలు..అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో తాను చెప్పేది నిజం అంటూ టీజీ కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమరావతిని రాజధానిగా ఉంచటం లేదని..ఏపీలో నాలుగు రాజధానులు రాబోతున్నాంటూ బాంబు పేల్చారు. అందునా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఈ మేరకు నివేదిక ఇచ్చారని..ఇదే విషయాన్ని తనకు బీజేపీ ముఖ్య నేత వివరించారని చెప్పుకొచ్చారు. దీంతో..అసలు టీజీ వ్యాఖ్యల్లో నిజమెంత.. ఆయన చెబుుతున్నట్లుగా ఏపీలో కొత్తగా నాలుగు రాజధానునలు సాధ్యమేనా అనే విషయం పైన చర్చ సాగుతోంది. అయితే, టీజీ చెప్పిన నాలుగు రాజధానులు వెను అసలు విషయం ఏంటంటే..అవి నాలుగు రాజధానులు కావని.. రాజధానుల తరహాలో నాలుగు నగరాలను డెవలప్ చేటయే లక్ష్యమని ప్రభుత్వంలోకి కీలక అధికారులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కేంద్రానిని నివేదించింది ఏంటంటే..

ముఖ్యమంత్రి కేంద్రానిని నివేదించింది ఏంటంటే..

ముఖ్యమంత్రి జగన్ ఏపీని అన్ని రంగాల్లో డెవలప్ చేసేందుకు తన విజన్ ఏంటనేది ప్రధానితో పాటుగా అమిత్ షాకు ఒక నోట్ ఇచ్చారు. చంద్రబాబు హాయంలో రాజధాని పేరుతో అవినీతి జరిగిందని.. గతంలో చేసిన తప్పు మరోసారి జరుగుతోంది..అన్ని ముఖ్య కార్యాలయాలు..సంస్థలు..అధికారం ఒకే చోటే ఏర్పాటు చేస్తున్నారని వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీని కారణంగా ఏపీలోని ఇతర ప్రాంతాల ప్రజల్లో అసహనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన డెవలప్ మెంట్ కారణంగా ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేసారని..ఫలితంగా ఏపీ ప్రజలు విభజన సమయంలో హైదరాబాద్ వదులుకో లేక ఆందోళన చెందారనే విషయాన్ని గుర్తు చేసారు. అందులో భాగంగానే.. అధికార వికేంద్రీకరణ దిశగా జగన్ తన ప్రణాళికకు నేరుగా కేంద్రానికి నివేదించారు. అమరావతి కేవలం అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ గా మాత్రమే ఉంచుతూ.. ఇతర ప్రాంతాల్లో ఒక్కో నగరాన్ని రాజధాని తరహాలో ప్రాధాన్యత ఇస్తూ..సంస్థలు..కార్యాలయాలు ఏర్పాటు చేయటం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ తమను పట్టించుకోవటం లేదనే అభిప్రాయాన్ని తొలిగించటంతో పాటు ప్రతీ ప్రాంతంలోనూ డెవలప్ మెంట్ కనిపిస్తోందని జగన్ వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా..ప్రాంతాలు.. సామాజిక సమీకరనాలతో పక్కా బ్యాలెన్స్ చేసుకుంటూ తన ప్రభుత్వం లో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించారు. ఇక, ఇప్పుడు కేంద్రానికి నివేదించిన దానిలోనే మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని ప్రాంతంలోని కార్యాలయాల్లో కొన్నింటిని గతంలో జరిగిన ఒప్పందాలు..ప్రాంతాల వారీ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని అక్కడకు తరలంచాలని జగన్ ఇప్పటికే దాదాపు నిర్ణయించారు.

వ్యూహంలో భాగంగానే కొత్త ప్రతిపాదనలు..

వ్యూహంలో భాగంగానే కొత్త ప్రతిపాదనలు..

ముఖ్యమంత్రి జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిదు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ప్రచారంలో ఉన్నా..నాలుగు బోర్డులు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినట్లు స్పష్టమైన సమాచారం. అందులో భాగంగా రాష్ట్రాన్ని నాలుగు ప్రణాళికాబోర్డులుగా విభజించి వాటిని ఆ రీజియన్లకు ముఖ్య కేంద్రాలుగు నాలుగు నగరాలను ఎంపిక చేయనున్నారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాలు విజయనగరం బోర్డులో, ఉభయగోదావరి-కృష్ణా జిల్లాలు (ఇప్పుడున్న అమరావతి సహా) కాకినాడ బోర్డులో, గుంటూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాలు గుంటూరు బోర్డులో, రాయలసీమ 4 జిల్లాలు కడప బోర్డులో ఉండేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యాలయాలు..సంస్థలను ప్రాంతాల వారీగా..అక్కడి భౌగోళిక .. సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తరలించేందుకు కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ప్రభుత్వం పైన సానుకూలత తీసుకురావటం ద్వారా రాజకీయంగానూ పై చేయి సాధించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. తాజా ఎన్నికల్లో ఉత్తరాంధ్ర..రాయలసీమలో టీడీపీ మీద వ్యతిరేకతకు అమరావతి మీద చంద్రబాబు అతిగా ప్రచారం చేయటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో..నాలుగు ప్రాంతీయ బోర్డుల ముఖ్య నగరాలను ఆ ప్రాంత రాజధానుల తరహాలో డెవలప్ చేసే విధంగా ప్రణాళికు సిద్దం చేస్తోందని సమాచారం. ఏపీ మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మాత్రం అమరావతి కొనసాగనుందని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తరువాత దీని పైన పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు.

English summary
Rajyasabha member TG Venkatesh sensational comments on AP Capital caused for hot discussion. TG says Govt planning to announce four citites as AP capitals. But CM Jagan Plan is now with cnet govt. As per CM Plan he want appoint four regional boards for develpment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X