అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం సరైనదే: టీజీ వెంకటేష్: సీఎంకు సలహాలు

|
Google Oneindia TeluguNews

ఏపీ శాసనసభ సమావేశాలు ముగిశాయి. రాజధాని అంశం పై ఏపీ అసెంబ్లీ లో జరిగిన సుదీర్ఘ చర్చలో ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందని ప్రకటించారు. టిడిపి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తే, బిజెపి మాత్రం స్వాగతించింది.

అభివృద్ధి వికేంద్రీకరణ వైపే సీఎం జగన్ మొగ్గు

అభివృద్ధి వికేంద్రీకరణ వైపే సీఎం జగన్ మొగ్గు

అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని అందుకే ఏపీకి మూడు రాజధానులు అవసరముందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో మూడు రాజధానులు ఉన్నాయని, మనం కూడా మారాలి అని, మన రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు రావచ్చు అని సీఎం జగన్ పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అందిన వెంటనే రాజధాని పై నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు.

నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం

నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే అందుకు అనుకూలంగా కావలసినవన్నీ ఉన్నాయని, ఒక మెట్రో రైలు వస్తే సరిపోతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునేమోనని ఏది ఏమైనా నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జగన్ పేర్కొన్నారు.

జగన్ వ్యాఖ్యలను స్వాగతించిన కర్నూలు ఎంపీ

జగన్ వ్యాఖ్యలను స్వాగతించిన కర్నూలు ఎంపీ

సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను ముఖ్యంగా ఎంతో కాలంగా రాయలసీమ కోసం పోరాటం సాగిస్తున్న బిజెపి ఎంపీ టీజి వెంకటేష్ స్వాగతించారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయన్నారు. అయితే కర్నూలులో హైకోర్టు మాత్రమే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఉంటే బాగుంటుంది అన్నారు.

కర్నూలులో అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న టీజీ వెంకటేష్

కర్నూలులో అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న టీజీ వెంకటేష్

కర్నూలులో అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటు చేస్తేనే రాజధానిగా అర్థం ఉంటుందని అదేవిధంగా అమరావతి, వైజాగ్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాజధానుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక అంతే కాదు ఈ క్రమంలో జగన్‌పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలు సరికావన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాన్ని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యక్తం చేశారు.

English summary
CM Jagan's comments on the three capitals were welcomed by BJP MP TG Venkatesh, who has been fighting for Rayalaseema for a long time. Rajya Sabha member of BJP, TG Venkatesh, expressed happiness over the decision of CM Jagan. Jagan's efforts to decentralize development have been promising. But in Kurnool, not only the High Court but also the Assembly and Secretariat would be good he stated .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X