వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెయిల్ ట్రాజెడీ: నగరం శ్మశానం, 17కు చేరిన మృతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: గెయిల్ పైప్ లైన్ పగిలి సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామం శ్మశానాన్ని తలపిస్తోంది. మనుషులు, పక్షులు, జంతువులు కాలి బుడిదైపోయి శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది.

గెయిల్ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య శనివారంనాడు 17కు చేరుకుంది. గాయపడినవారు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. బాధితులు తల్లిడిల్లిపోతున్నారు. పరిస్థితి అత్యంత విషాదకరంగా ఉంది.

మంటలు చుట్టుముట్టాయి

మంటలు చుట్టుముట్టాయి

గెయిల్ గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో లేచిన మంటలు చాలా దూరం వ్యాపించాయి. దీంతో నగరం గ్రామంలో మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా మృత్యువాత పడ్డాయి.

కొబ్బరి తోటలు ఖతమ్

కొబ్బరి తోటలు ఖతమ్

పచ్చని కోనసీమలో మంటలు చిచ్చుపెట్టాయి. కొబ్బరి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రజలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

వ్యాపించిన అగ్నికీలలు

వ్యాపించిన అగ్నికీలలు

గ్యాస్ పైప్ లైన్ లీకయి మంటలు లేవడంతో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. 16 మంది మృత్యువాత పడ్డారు.

చెట్లూ చేమలు బూడిద

చెట్లూ చేమలు బూడిద

పచ్చిన తోటలు, చెట్లు బూడిద పాలయ్యాయి. నగరం గ్రామం శ్మశానంగా మారిపోయింది. పరిస్థితి దారుణంగా ఉంది.

చంద్రబాబు సూచన

చంద్రబాబు సూచన

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పరామర్శించారు.

చంద్రబాబు పరామర్శ

చంద్రబాబు పరామర్శ

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించి, ఉత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

వ్యాపించిన మంటలు

వ్యాపించిన మంటలు

గ్యాస్ పైప్ లైన్ లీకయి చెలరేగిన మంటలు నగరం గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. వారు పరుగులు తీశారు.

నగరం గ్రామం శ్మశానం

నగరం గ్రామం శ్మశానం

తూర్పు గోదావరి జిల్లాలోని నగరం గ్రామం శ్మశానంగా మారిపోయింది. ప్రజలు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు.

క్షతగాత్రుల కోసం అంబులెన్స్

క్షతగాత్రుల కోసం అంబులెన్స్

క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్స్ వాహనం వచ్చింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

సహాయక చర్యలు

సహాయక చర్యలు

మంటలకు ఆహుతి అయిన నగరం గ్రామంలో సహాయక చర్యలు ఇలా కొనసాగాయి. మృతులు గుర్తు పట్టనరాతంగా కాలిపోయారు.

English summary
The daeth toll in GAIL pipe line leakage tragedy has reached to 16. The Nagaram village is like burrial ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X