• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ స్వీపర్‌ జీతం అక్షరాలా లక్షన్నర...విద్యుత్ శాఖలో ఉద్యోగం:సోషల్ మీడియాలో పేస్లిప్ వైరల్

|

రాజమండ్రి:ఇటీవల వాట్సాప్ లో ఒక పోస్ట్ వైరల్ గా మారి తెగ తిరిగేస్తోంది. అది ఒక స్వీపర్ జీతం లక్షన్నర అంటూ అందుకు ఫ్రూప్ గా ఆమె పే స్లిప్ ఫోటో జత చేసిన పోస్ట్.

ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగంతో సంబంధం లేకుండా జీతాలు ఎక్కువే ఉంటాయనేది తెలిసినా మరీ స్వీపర్ కు అంత జీతమా...ఇది ఖచ్చితంగా ఫేక్ పోస్ట్ అయి ఉంటుందని చాలామంది అనుకున్నారు. అయితే ఆ పోస్ట్ లోని పే స్లిప్ లో పేరు, శాఖా వివరాలు ఉండటంతో మీడియా ఆ స్వీపర్ గురించి ఆరా తీయగా ఆ విషయం నిజమేనని తేలింది. ఆమె రాజమండ్రిలో విద్యుత్ శాఖలో పని చేస్తారని తెలిసింది. వివరాల్లోకి వెళితే...

సందేహం...తలెత్తింది

సందేహం...తలెత్తింది

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాక నెటిజన్లలో ఒక సందేహం తలెత్తింది. అది ఒక ప్రభుత్వ ఉద్యోగిని చిరుద్యోగి అని ఎప్పుడు అంటారు?...హోదాను బట్టా?...లేక జీతాన్ని బట్టా?...సహజంగా హోదాను బట్టే అనేది అందరికీ తెలిసిన విషయమే...కానీ ఈమె విషయంలోనే వారందరూ ఆ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. కారణం హోదాను బట్టి చిరుద్యోగి అయిన ఈమె జీతం చూస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్లే ఈర్ష్య పడేంత!...నోళ్లు వెళ్లబెట్టేంత!..పైగా ఈమె నిరక్షరాస్యురాలు కావడం వారి అసూయకు మరో కారణం....అర్థం కాలేదా?..అయితే మరింత వివరంగా..

సూపర్ స్టార్...శాలరీ స్టార్

సూపర్ స్టార్...శాలరీ స్టార్

ఈమె పేరు కోల వెంకట రమణమ్మ. ఉద్యోగం రాజమండ్రిలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్కమ్‌లో స్వీపర్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె కూడా సూపర్ స్టార్. కారణం ఈమె జీతం...అక్షరాలా రూ.1,47,722. ఇదీ ఈమె శాలరీ. స్వీపర్ వంటి చిరుద్యోగం చేస్తూ అంత జీతం తీసుకుంటుండటమే ఈమె స్పెషాలిటీ. అయితే ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే...ఒక స్వీపర్ కు అంత జీతం వస్తోందంటే ఎవరూ నమ్మరు కాబట్టి...ఎవరో ఈ విషయాన్ని ఆమె పే స్లిప్ తో సహా వాట్సాప్ లో పెట్టారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారి తెలుగునాట చిన్నపాటి సంచలనమే సృష్టిస్తోంది.

విద్యుత్ శాఖదే...ఆ గొప్పతనం

విద్యుత్ శాఖదే...ఆ గొప్పతనం

నిజానికి ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది విద్యుత్ శాఖ గురించి...ఎందుకంటే ఇలా లక్షకు పైబడి జీతం తీసుకునే నాలుగో తరగతి ఉద్యోగులు ఆ శాఖలోని డిస్కమ్‌లలో చాలామందే ఉన్నారు. అందుకే అంటారు విద్యుత్తు శాఖలో ఉద్యోగం అంటే...వేతనాల వర్షమే అని!...అయితే ఇదంతా సంస్కరణల ఫలమేనట. మొదట్లో విద్యుత్తు శాఖను ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు అని పిలిచేవారు.ఆ తరువాత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్తుశాఖలో సంస్కరణలకు తెరతీసిన సంగతి తెలిసిందే. ఆక్రమంలో బోర్డు పోయి ‘కంపెనీ'లు వచ్చాయి. అలా విద్యుత్తు ఉత్పత్తికి...జెన్‌కో; విద్యుత్ సరఫరాకు...ట్రాన్స్‌కో ఏర్పడ్డాయి. అలా ట్రాన్స్‌కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌ల ఏర్పాటు జరిగింది.

సంస్కరణల వల్లే...అలా

సంస్కరణల వల్లే...అలా

అయితే ఈ సంస్కరణలు కలకలం రేపడంతో పాటు ఉద్యోగుల్లో ఆందోళన తలెత్తింది. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్‌ రాకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం జీతాలు భారీగా పెంచింది. అలాగే ఇంక్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించింది. అలా ఆ శాఖల్లో అన్ని హోదాల ఉద్యోగులూ మంచి జీతాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వీసు పరంగా బాగా సీనియర్ అయిన ఈ సూపర్ స్టార్ స్వీపర్‌ జీతం కూడా ఐదంకెలు దాటి ఆరు అంకెల్లోకి చేరడమే కాదు...ఇదుగో ఇలా అందరూ అసూయ పడే స్థాయికి పెరిగింది. ఆ శాఖలో మరో విశేషం చెప్పాలంటే ఒక ట్రాన్స్‌కో సీఎండీ కంటే 30 ఏళ్ల సర్వీసు ఉన్న చీఫ్‌ ఇంజనీర్‌ జీతభత్యాలు ఎక్కువకావడం!

ఇదీ...ప్రస్థానం

ఇదీ...ప్రస్థానం

ఇక మళ్లీ సూపర్ స్టార్ స్వీపర్ విషయానికొస్తే రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ 1978లో 16వ ఏటనే విద్యుత్తు శాఖలో రోజువారీ ఉద్యోగిగా చేరారు. ఈమె తల్లి కూడా ఇక్కడే స్వీపర్‌ పనిచేసేవారని తెలిసింది. వెంకటరమణమ్మ 1981 ఏప్రిల్‌ 1న పర్మినెంట్‌ ఎంప్లాయ్‌గా మారారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని విద్యుత్ విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటినా రిటైర్‌మెంట్‌కు ఇంకా నాలుగేళ్లు సమయం ఉంది. ఇంత సుదీర్ఘ సర్వీసు కావడం వల్లే జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది.

విధి నిర్వహణ...కుటుంబ పరిస్థితులు

విధి నిర్వహణ...కుటుంబ పరిస్థితులు

ఇక వెంకటరమణమ్మ విధినిర్వహణ,కుటుంబం విషయాలకొస్తే...ఉదయాన్నే ఠంచన్ గా 8 గంటల కల్లా ఆఫీసుకు వచ్చే రమణమ్మ సాయంత్రం 8 గంటల వరకు నిబద్దతతో పనిచేస్తారట...పని మాటల్లో కాకుండా చేతల్లో చూపే ఆమె అంటే అందరికీ గౌరవం అంటున్నారు. రమణమ్మకు ఇద్దరు కుమారులు కాగా రైల్వేలో పని చేసే భర్త వీరభద్రరావు సర్వీస్ లో ఉండగానే చనిపోవడంతో ఆయన ఉద్యోగం ఒక కుమారుడికి వచ్చింది. అయితే మరో కొడుకు గుండె జబ్బు, ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. ఇటీవల ఇల్లు కట్టుకోవడం కోసం లోన్‌ తీసుకున్నట్లు రమణమ్మ మీడియాకు తెలిపారు. నిరక్షరాస్యురాలైన ఈమె కనీసం సంతకం పెట్టడం నేర్చుకోవాలన్న సిఎం పిలుపుతో ఇటీవలే సంతకం పెట్టడం నేర్చుకున్నారు.

English summary
Rajahmundry: Recently a post has gone viral in Whatsapp. It's about a sweeper salary and that post attached a pay slip photo also.Epressed doubts about this post is it true or fake, and finally it has been proved to be true. This post about rajahmundry electricity lady employee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X