కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ 57 ప్రాజెక్టులు పూర్తి చేస్తా: చంద్రబాబు;నిరుద్యోగ భృతి సూపర్ హిట్ అవుతుంది:లోకేష్

|
Google Oneindia TeluguNews

కర్నూలు:వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని నిర్ణయించుకున్నానని, అందుకోసమే రాష్ట్రంలోని 57 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు పూనుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

శుక్రవారం కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి ముఖ్యమంత్రి చంద్రబాబు హారతిచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా పనులు ఆపకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. 2500 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని, ఆ నీళ్లు ఇక్కడికి వస్తే శ్రీశైలం నిండిపోతుందని చెప్పుకొచ్చారు.

The 57 water projects will be completed:CM Chandra Babu, Unemployment Scheme will be super hit:Lokesh

రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పట్టిసీమను ప్రస్తావిస్తూ దాని ఫలితాలు కూడా వచ్చాయన్నారు. గేట్లు ఎత్తకపోతే కృష్ణా డెల్టా ఎండిపోతుందని పోరాటాలు చేశారని, రాయలసీమ నాలుగు జిల్లాలు, కర్నూలు జిల్లాలకు నీళ్లు అందించే పరిస్థితి వస్తుందన్నారు. జనవరి కల్లా వెలుగొండ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గుండ్లకమ్మ పూర్తి చేసి గ్రామాలకు నీరిస్తామన్నారు.
కర్నూలు జిల్లాలో హంద్రీనీవాకు ప్రాధాన్యమిచ్చామని... బ్రహ్మసాగర్‌ నుంచి కర్నూలు జిల్లాకు నీళ్లు ఇస్తామని చెప్పారు. కడప, అనంతపురం, చిత్తూరుకు కూడా నీళ్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. పోలవరం గ్యాలరీ వాక్‌ బ్రహ్మాండంగా చేశామన్నారు. గండికోటలో 24 టీఎంసీలు పెట్టుకునే పరిస్థితి ఉందన్నారు.ఈనెలలో 12, అక్టోబర్‌లో 3, డిశంబర్‌లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మరోవైపు అమరావతిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి సూపర్‌ డూపర్ హిట్టవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మారుస్తామని, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తూనే ఆయా రంగాల్లో శిక్షణ ఇస్తామని ఆయన వెల్లడించారు. చాలా రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతిపై ప్రభుత్వాలు చేతులెత్తేశాయని, అయితే తాము ఆయా రాష్ట్రాల్లో లోపాలను గుర్తించామని, ఏపీలో ఆ పరిస్థితి రానివ్వమని లోకేష్ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులను గుర్తించామని, నిరుద్యోగ భృతికి 22 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు అర్హులని తెలిపారు. అక్టోబర్‌ 2 నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్‌ వివరించారు.

English summary
Kurnool:AP CM Chandra babu said that In order to convert rain water into ground water, he decided to complete 57 water projects in state. Another side minister Lokesh said that unemployment benefit scheme in the state would be super hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X