వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలపై పట్టు కోసం కాంగ్రెస్ ను చంద్రబాబు వాడుకోనున్నారా?...స్కెచ్ ఎప్పుడో రెడీనా!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం చంద్రబాబు కాంగ్రెస్ ను వాడుకోనున్నారా?...ఇందుకోసం చంద్రబాబు ఎప్పుడో స్కెచ్ వేశారా?...అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అందుకు నిదర్శనంగా ఇటీవలి జరిగిన పలు రాజకీయ పరిణామాలను ఉదాహరణగా చూపుతున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి ఒక మీడియా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని పక్కాగా నిర్ధారిస్తున్నాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ అంటకాగడం ఆ పార్టీ లోని కొందరు నేతలకు ఏ మాత్రం ఇష్టం లేదని...అందుకు డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలే నిదర్శనమని అంటున్నారు. కాంగ్రెస్ తో టిడిపి దోస్తీ ఖాయమంటున్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఇలా ఉంది.

పొత్తు ఆలోచన...గత ఏడాదే

పొత్తు ఆలోచన...గత ఏడాదే

టిడిపి అధినేత సాధారణంగా పొత్తులతోనే ఎన్నికలు ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ క్రమంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోజనం పొందవచ్చని చంద్రబాబు భావనని వారు విశ్లేషిస్తున్నారు. గతంలో వైఎస్ మరణం అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవసరాన్ని బట్టి కాంగ్రెస్ కు సహకారం వంటి పరోక్ష చర్యలు కాకుండా నేరుగా ఆ పార్టీతో సంబంధం పెట్టుకునే ఆలోచన చేసింది...తదనుగుణంగా స్కెచ్ రెడీ చేసింది...గత ఏడాది అక్టోబర్ నెలలో అంటున్నారు. ఆ స్కెచ్ ప్రకారమే రేవంత్ రెడ్డి టిడిపిని వదిలి కాంగ్రెస్ లో చేరారని చెబుతున్నారు.

రేవంత్ రాజీనామా...ప్లాన్ లో భాగమే

రేవంత్ రాజీనామా...ప్లాన్ లో భాగమే

టిడిపికి రేవంత్ రాజీనామా సందర్భంగా చోటుచేసుకున్న భావోద్వేగాలు చంద్రబాబు,రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుందని...తెలంగాణాలో బలమైన క్యాడర్ ఉన్న టిడిపి ఇంకా బలోపేతం కావాలన్నా...మనుగడ కొనసాగించాలన్నా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం ద్వారా సాధ్యపడుతుందని చంద్రబాబు అంచనా వేశారట. అందుకే భవిష్యత్ అవసరాల దృష్ట్యా తనకు ఎంతో విశ్వాసపాత్రుడైన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించారట. అందుకు నిదర్శనంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండి కూడా టిడిపి చంద్రబాబు అనుకూల వ్యాఖ్యలు చేయడమే అంటున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ టిడిపి నుంచి నేటికి తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ కు చేరకపోవడం కూడా మరో రుజువు అంటున్నారు.

రేవంత్ అనుచరురాలికి...ఆంధ్రా ఇన్ ఛార్జ్ పదవి

రేవంత్ అనుచరురాలికి...ఆంధ్రా ఇన్ ఛార్జ్ పదవి

ఇటీవల కర్ణాటక ఎన్నికల సందర్భంగా బిజెపి వ్యతిరేకంగా...కాంగ్రెస్ కు పరోక్షంగా టిడిపి శ్రేణులతో పనిచేయించిన చంద్రబాబు కుమార స్వామి సిఎంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో చేతులు కలపడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై టిడిపి ముఖ్య నేతలు కాంగ్రెస్ తో చంద్రబాబు కలవలేదంటుండగా మీడియాలో మరో రకంగా వార్తలు వెలువడ్డాయి. ఇదిలావుండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క నియమితులవడం ఈ కాంగ్రెస్-టిడిపి పొత్తుపై ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ధనసరి సీతక్క ఇటీవలి కాలం వరకు తెలంగాణా టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించిన మహిళా నేత కావడం...ఆమె రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. ఏపీ మహిళా కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ఏరి కోరి రేవంత్ రెడ్డి అనుచరురాలిని ఎంపిక చేయడం కాంగ్రెస్-చంద్రబాబు మధ్య ఉన్న సానుకూల దృక్పధానికి రుజువుగా నిలుస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

తాజాగా...కుమార స్వామి:కలకలం

తాజాగా...కుమార స్వామి:కలకలం

క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక మీడియా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిందిగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తనకు సూచించారని చెప్పారు. స్థానిక రాజకీయ పరిమితుల కారణంగా నష్టదాయక ఈ అంశాన్ని కుమారస్వామి ఇంత బహిరంగంగా వెల్లడించడంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇబ్బందికరంగా మారింది. అయితే అదే సమయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కు కాంగ్రెస్ పట్ల చూపుతున్న సానుకుల ధోరణికి ఇదే ఒక రుజువుగా నిలిచింది. ఇంతకాలం కేవలం ఊహాగానంగా, ఆధారాల్లేని ఆరోపణగా టిడిపి నేతలు కొట్టిపడేసిన ఈ అంశానికి కుమారస్వామి వ్యాఖ్యలే ఒక ఆధారంగా నిలిచాయి. దీంతో భవిష్యత్తులో టిడిపి-కాంగ్రెస్ పొత్తు పొడవడం ఖాయమనడానికి కూడా ఒక నిదర్శనంగా నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.

తాజాగా...కుమార స్వామి,చంద్రబాబు వ్యాఖ్యలు

తాజాగా...కుమార స్వామి,చంద్రబాబు వ్యాఖ్యలు

క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక మీడియా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిందిగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తనకు సూచించారని చెప్పారు. స్థానిక రాజకీయ పరిమితుల కారణంగా నష్టదాయక ఈ అంశాన్ని కుమారస్వామి ఇంత బహిరంగంగా వెల్లడించడంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇబ్బందికరంగా మారింది. అయితే అదే సమయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కు కాంగ్రెస్ పట్ల చూపుతున్న సానుకుల ధోరణికి ఇదే ఒక రుజువుగా నిలిచింది. ఇంతకాలం కేవలం ఊహాగానంగా, ఆధారాల్లేని ఆరోపణగా టిడిపి నేతలు కొట్టిపడేసిన ఈ అంశానికి కుమారస్వామి వ్యాఖ్యలే ఒక ఆధారంగా నిలిచాయి. అంతేకాదు 2019లో జాతీయస్థాయిలో పొత్తులు ఉండవని...రాష్ట్రస్థాయి పొత్తులే నిర్ణయాత్మకంగా మారుతాయని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్రాల స్థాయిలో టిడిపి-కాంగ్రెస్ పొత్తు పొడవడం ఖాయమనడానికి కూడా ఒక నిదర్శనంగా చెప్పవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.

English summary
Amaravathi: Political observers have been analyzing that these are the reasons to say alliance possible betweent tdp-congress
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X