• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్ని వర్గాలకు సముచిత స్థానం..! ఉమ్మారెడ్డి కి డిప్యూటీ సీయం...?!!

|

అమరావతి/హైదరాబాద్: ఒక దెబ్బకు రెండు పిట్టల ను ఎలా కొట్టాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్న కొన్ని పాఠాలలో ఇదొకటి. ముఖ్యమంత్రి ఐన తర్వాత ఆ వ్యూహానికి మరింత పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి పదవులతో నాయకులనే కాకుండా ఆ సామాజిర వర్గానికి ఎలా న్యాయం చేసాడో., ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

పార్టీ కి పదేళ్లుగా సేవలందించి వారి చాలా మందే ఉన్నారు. వారిలో జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. వారందరికి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం మామూలు విషయం కాదు. పార్టీ సీనియర్ నేతగా ఎప్పటినుండో జగన్ కు కుడి బుజంగా వ్యవహరిస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిప్యూటీ సీయం పదవి కట్టబెట్టాలని జగన్ కోటరీలో కొత్తగా తెరమీదకు వచ్చిన ప్రతి పాదన. మరి ఉమ్మారెడ్డి విషయంలో జగన్ మనసులో ఏముందో కొద్ది రోజులు ఆగితే గాని స్పష్టత వచ్చేట్టు కనిపించడం లేదు.

తండ్రి బాటలో జగన్..! ఆచి తూచి పదవుల పందేరం..!!

తండ్రి బాటలో జగన్..! ఆచి తూచి పదవుల పందేరం..!!

ఏపీ రాజకీయాల్లో కీలకమైన అనేకాంశాల్లో కులం ఒకటి. 2014 ఎన్నికల్లో కాపులంతా టీడీపీ వెంట వెళ్లారు. దీంతో, అప్పుడు ఆ పార్టీ మెజార్టీ సీట్లు సాధించింది. అధికారానికి వైసీపీ దూరమైంది. ఆ తరువాతి కాలంలో, కాపులు మనసు మార్చుకున్నారు. తమ కోరికలు పూర్తి స్థాయిలో నెరవేరలేదని గ్రహించిన కాపులు ఈసారి వైసీపీకి జైకొట్టారు. బలమైన కాపు సామాజిక ఓటు బ్యాంకును తన ఖాతాలోనే భద్రంగా ఉంచడంపై, వచ్చే ఎన్నికల నాటికి వారు ఏమాత్రం అసంతృప్తికి లోనవకుండా, తన ప్రభుత్వంపై పూర్తి సంతృప్తికరంగా ఉండేలా జగన్ కసరత్తు సాగిస్తున్నారు.

 కాపులకు సరైన గుర్తింపు..! డిప్యూటీ పదవి ఇవ్వాలని యోచిస్తున్న వైసీపి అదిష్టానం..!!

కాపులకు సరైన గుర్తింపు..! డిప్యూటీ పదవి ఇవ్వాలని యోచిస్తున్న వైసీపి అదిష్టానం..!!

2014లో చంద్రబాబు గెలవగానే డిప్యూటీ సీఎంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చిన్నరాజప్పను నియమించారు. తమను గెలిపించిన కాపులకు ఇలా సంతృప్తిపరిచారు. బాబు మాదిరిగానే, ఇప్పుడు జగన్ కూడా, కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు. ఈ పోస్టుకు ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. గోదావరి - గుంటూరు - కృష్ణా జిల్లాల్లో బలంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకోవాలంటే ఉమ్మారెడ్డికి డిప్యూటీ సీఎం ఇవ్వక తప్పదన్న చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతోంది.

ర‌ఫ్‌గా పెరిగిన గెడ్డం..: జ‌గ‌న్‌లో త‌మ‌ను చూసుకుంటున్న యువ‌త‌: ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్లు అనూహ్యం

 ఉమ్మారెడ్డికి ఉప ముఖ్యమంత్రి స్థానం..! కాపులను గౌరవించినట్టే..!!

ఉమ్మారెడ్డికి ఉప ముఖ్యమంత్రి స్థానం..! కాపులను గౌరవించినట్టే..!!

దీని ద్వారా, జగన్ కు రెండు అంశాలు కలిసొస్తాయి. ఒకటి- మంత్రి వర్గ కూర్పులో కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. రెండు- పార్టీ సీనియర్ నేతలకు జగన్ సముచిత రీతిలో గౌరవం ఇస్తారన్న సంకేతాలు పార్టీ నేతలతో పాటు పార్టీ శ్రేణుల్లోకి వెళతాయి. అంటే, 'ఒక దెబ్బకు రెండు పిట్టలు' అన్నమాట. ఈ దిశగా జగన్ లోతైన కసరత్తు చేస్తున్నట్టు, ఒకటి రెండు రోజుల్లో తన ఉద్దేశాన్ని బహిర్గతం చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది.

జగన్ కీలక నిర్ణయం..! ఉత్కంఠలో నాయకులు..!!

జగన్ కీలక నిర్ణయం..! ఉత్కంఠలో నాయకులు..!!

ఒక వ్యక్తిని గౌరవించినంత మాత్రాన, అత్యున్నత పదవి కట్టబెట్టినంత మాత్రాన, ఆయా సామాజిక వర్గాన్ని మొత్తం సంతృప్తిపరిచినట్టవుతుందా...? ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టవుతుందా అంటే ఎంత మాత్రం కాదనే సమాధానం వస్తోంది. ఆ సామాజికవర్గంలో ఇతర నాయకులతోపాటు సామాన్య ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతలను ఆ నేత తన భుజస్కందాలపై మోసినప్పేడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని సీఎం జగన్ ఎంత వరకు ఆచరణలో పెట్టి చూపిస్తారో చూడాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jagan is doing a good job of keeping the KAPU vote bank secure in his account and making sure that they are no longer satisfied by the next election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more