విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగినపూడి బీచ్ ఫెస్టివల్...గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం భారీ దోశ:కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ:రాష్ట్రంలో ఇంతకుముందెన్నడూ లేనంత ఘనంగా మంగినపూడి బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించబోతున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే మచిలీపట్నం మంగినపుడి బీచ్ పెస్టివల్ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీచ్ ఫెస్టివల్ విశేషాలు వివరించారు. బీచ్ ఫెస్టివల్ ను పురస్కరించుకొని ఈ నెల7వ తేదీన మచిలీపట్నం లో 2కె వాక్ నిర్వహిస్తున్నామని చెప్పారు.బీచ్ పెస్టివల్ లో భాగంగా హెలి టూర్ ఏర్పాటు చేశాము.ఒక్క మనిషికి హెలికాప్టర్ లో టూర్ కి 2500 రూపాయలు ఛార్జి వసూలు చేస్తారని చెప్పారు. బీచ్ ఫెస్టివల్ లో భాగంగా గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం 100 అడుగుల దోస తయారు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

The biggest Dosa for the Guinness book of records: Krishna District collector Lakshmikantam

అలాగే బీచ్ వాలీబాల్,బీచ్ కబడ్డీ పోటీలు ఉంటాయన్నారు.రాష్ట్రంలో అతి పురాతన నగరాల్లో ఒకటైన బందరు బీచ్ పెస్టివల్ భాగంగా కొత్త రూపురేఖలు దిద్దుకోబోతోందని తెలిపారు.మరోవైపు కృష్ణా జిల్లా రానున్న డిసెంబర్ నాటికి దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న జిల్లాగా ప్రథమ స్థానం అధిరోహించబోతోందని కలెక్టర్ చెప్పారు.

ప్రపంచ పర్యావరణా దినోత్సవం నాటి నుండి మొదలు పెట్టి కార్తీక మాసం వరకు జిల్లాలో కోటి మొక్కలు నాటనున్నామని కలెక్టర్ లక్ష్మీరాజ్యం తెలిపారు.

English summary
Vijayawada: Krishna district collector Laxmikantam said that the Manginapudi beach festival is going to be held as never before in the State. He called for the success of Machilipatnam Manginapudi Beach Festival held on 9th, 10th and 11th of this month.The collector revealed that 100 feet of Dosa will made for the Guinness Book of Records as part of the Beach Festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X