వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదడు మోకాల్లో ఉందా .. అరికాల్లో ఉందా ? మోపిదేవిపై మాజీ మంత్రి జవహర్ ఫైర్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. కరోనా వ్యాప్తికి టీడీపీనే కారణమని టీడీపీపై మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తికి టీడీపీ కుట్రలు చేసిందేమోనన్న అనుమానం వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు .ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసమే ప్రయత్నాలు చేస్తుంటారని కరోనా వ్యాప్తికి టీడీపీ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నాయేమో అన్న అనుమానం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. మంత్రి మోపిదేవి వెంకట రమణకు మెదడు మోకాల్లో ఉందా లేకా అరి కాల్లో ఉందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .

మంత్రి మోపిదేవి స్లీపర్‌ సెల్స్‌ అంటూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇక కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని అందుకే కేసులు ఇంతగా పెరుగుతున్నాయని అన్నారు. వైసీపీ చేతగాని ప్రభుత్వమా? రాష్ట్రంలో కరోనా వైరస్‌ను నియంత్రించలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఆయనకు మెదడు మోకాళ్లో ఉందో.. అరికాళ్లో ఉందో తెలియడంలేదన్నారు.

Recommended Video

COVID-19 : Coronavirus Didn't Even Leave Supreme Court,1 Test Positive,2 In Quarentine
The brain is in the knees or soles? Jawahar Fire on Mopidevi

ఇక ఇదే సమయంలో మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా? దద్దమ్మ ప్రభుత్వమా? అని నిలదీశారు . ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారా? మీ ఇంటిలిజెన్స్ వైఫల్యం చెందిందా?' అని ప్రశ్నించారు మాజీ మంత్రి జవహర్ . సీఎం జగన్ ధోరణి ఎలా ఉందంటే కరోనాతోప్రజలు చస్తే చావనీ, స్థానిక ఎన్నికలు జరిపించుకుని, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నారని ఆయన ఆరోపించారు . ప్రజల బాగోగులు పట్టించుకోవడంలేదని జవహర్ విమర్శించారు.ఇక ఒక మంత్రి హోదాలో ఉండి మోపిదేవి వెంకట రమణ మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని ప్రశ్నించారు మాజీమంత్రి జవహర్ .

English summary
Former minister Jawahar said that Minister Mopidevi was talking about sleeper cells. He said that the YCP government has failed under Corona control and hence cases are increasing.He said that the state has spoken out about not being able to control the corona virus in the state. He does not know whether his brain is in the knee or foot .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X