అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతి, ప్రధానికి అమరావతి రైతుల లేఖలు : రాజధాని తరలింపు ఆపాలంటూ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Amaravati Farmers Continue Protests Against Three Capitals

ఏపీ రాజధాని పైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదనలు...జీఎన్ రావు కిమటీ సూచనల పైన మండిపడుతున్న అమరావతి ప్రాంత రైతులు మద్దతు కోసం కొత్త మార్గం ఎంచుకున్నారు. రాజధాని తరలింపు జరిగితే తమకు జరిగే అన్యాయం వివరిస్తూ రాష్ట్రపతి కోవింద్..ప్రధాని మోదీకి సామూహిక లేఖలు రాసారు. ఆ లేఖలతో పాటుగా తాము రైతులమని వివరిస్తూ ఆధార పత్రాలు..అమరావతి ప్రాంతానికి చెందిన వారమంటూ ఆధార్ కార్డులు..చిరునామా ప్రూఫ్ లు ఆ లేఖలకు జత చేసారు. అదే సమయంలో గత ప్రభుత్వంతో తాము చేసుకున్న ఒప్పందాలను..రాజధానిలో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలు.. అక్కడ చేసిన ఖర్చు వివరాలతో సహా తమకు న్యాయం చేయాలని కోరుతూ లేఖలు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు.

ఎన్నార్సీపై ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది: మడమతిప్పే నాయకుడు కదా: లోకేశ్ సెటైర్..!ఎన్నార్సీపై ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది: మడమతిప్పే నాయకుడు కదా: లోకేశ్ సెటైర్..!

రాష్ట్రపతి..ప్రధానికి లేఖలు..
అమరావతి రైతులు తమ ఆవేదనను రాష్ట్రపతి..ప్రధానికి వివరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా స్థానికంగా అధికార వైసీపీ మినహా ఇతర పార్టీల నేతలు ఇప్పటికే మద్దతుగా నిలవటంతో కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో రాష్ట్రపతి..ప్రధానికి లేఖలు రాసారు.

The collective letters of the farmers to PM to prevent the evacuation of the capital

ప్రభుత్వం అమరావతి నుండి రాజధాని తరలింపు ఆలోచనలో ఉందని..అదే జరిగితే తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. లేఖలకు తమ ఆధార్ కార్డులు..ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను జత చేస్తూ స్పీడ్ పోస్టు ద్వారా పంపారు. తాము 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చామని..ఇప్పుడు రాజధాని తరలిస్తే తమకు అన్యాయం జరుగుతుందని లేఖలో వివరించారు.

తరలింపు అడ్డుకోండని కోరుతూ..
ప్రభుత్వం రాజధాని కార్యకలాపాల పేరుతో సచివాలయం తరలిస్తే.. తమకు భవిష్యత్ లేదని స్థానిక రైతులు లేఖల్లో స్పష్టం చేసారు. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ అసెంబ్లీలో చెప్పిన విషయాలను సైతం ప్రస్తావించారు. అదే విధంగా ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో జరిగిన ఖర్చు...నిర్మాణాల గురించి అధికారిక సమాచారం అందులో పొందు పర్చారు.

అమరావతికి సంబంధించి సీఆర్డీఏ చట్టం ఏం చెబుతుందనే అంశాలను వివరిస్తూ.. తమతో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సైతం రైతులు లేఖలో వివరించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చకుండా నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని..తమకు అండగా నిలవాలని రైతులు తమ లేఖల్లో రాష్ట్రపతి..ప్రధానిని అభ్యర్ధించారు.

English summary
Amaravati farmers letters to President Kovind and Prime Minister Modi with their proofs. They requested PM to involve and direct AP govt to stop capital shifting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X