వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇసుక ర్యాంపు: టిడిపి-బిజెపి ఎమ్మెల్యేల ఘర్షణ

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: రాజమండ్రి నగర, గ్రామీణ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. రాజమండ్రి నగరంలోని కుమారీ టాకీస్ వద్ద ఇసుక ర్యాంపులు ప్రారంభించడానికి వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఎదుట భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వర్గీయులు ఆందోళనకు దిగారు.

ఇసుకను తక్కువ ధరకే అమ్మాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పర వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మాటల తీవ్రత పెరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కాగా, బుచ్చయ్య చౌదరి ఇసుక ర్యాంపు ప్రారంభ కార్యక్రమాన్ని ఉల్లితోట మహిళా సంఘాలు సభ్యులు అడ్డుకున్నారు. దీంతో తన నియోజకవర్గంలోకి రావద్దని బుచ్చయ్య చౌదరి.. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను హెచ్చరించారు.

The conflict between Gorentla and Akula

ఇటీవలి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా టిడిపి రాజమండ్రి నగర సీటును బిజెపికి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే గోరంట్లకు నగర టిడిపి కేడర్‌తో పార్టీ ఆవిర్భావం నుంచి అనుబంధం కొనసాగుతోంది.

ప్రస్తుతం అధికారికంగా గోరంట్ల రూరల్ నియోజకవర్గానికి చెందడంతో నగర పార్టీ దేశం కేడర్ బిజెపి ఎమ్మెల్యే అయిన సత్యనారాయణతో సయోధ్యగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే శాసనసభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి వీరిద్దరి మధ్య ప్రొటోకాల్ విషయంలో చాలుసార్లు వివాదాలు చేసుకున్నాయి.

English summary
The conflict occurred between Telugudesam MLA Gorentla and Bharatiya Janata Party MLA Akula Satyanarayana on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X