వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు భారీ కుట్ర జరిగిందా ..? సీపీఐ నేత సంచలన ఆరోపణ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ ను ఓడించే కుట్ర .. ఓటుకు ౩ వేలు ఇచ్చారట...!! || Oneindia Telugu

ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఉద్రిక్తత తగ్గటం లేదు. నేతలు సంచలన ఆరోపణలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నగదు వరదను పారించాయని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను భీమవరంలో ఓడించడానికి రాజకీయ పార్టీలు భారీ కుట్రకు తెరలేపాయని సీపీఐ నేత రామకృష్ణ సంచలన ఆరోపణ చేశారు. ఒక్కో ఓటుకు రూ.3,000 ఖర్చు పెట్టారని ఆరోపించారు.

హైకోర్టుకు చేరిన ఇంటర్ బోర్డు వ్యవహారం .. బాలల హక్కుల కమీషన్ పిటీషన్ పై విచారణ <br>హైకోర్టుకు చేరిన ఇంటర్ బోర్డు వ్యవహారం .. బాలల హక్కుల కమీషన్ పిటీషన్ పై విచారణ

 ఈసీతీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సీపీఐ నేత రామకృష్ణ

ఈసీతీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సీపీఐ నేత రామకృష్ణ

విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రామకృష్ణ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఎన్నికల్లో ధన ప్రవాహం ఈసీకి కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఈసీ వ్యవహరించిన తీరుపై తాము సుప్రీం ను ఆశ్రయిస్తామని చెప్పారు.

పవన్ ను ఓడించేందుకు భారీ కుట్ర .. ఓటుకు 3 వేలు ఇచ్చారని ఆరోపణ

పవన్ ను ఓడించేందుకు భారీ కుట్ర .. ఓటుకు 3 వేలు ఇచ్చారని ఆరోపణ

ప్రస్తుతం డబ్బున్నవారే ఏపీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు సమీక్షలు చేయకూడదని ఈసీ మాట్లాడుతోందనీ అది ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కు రూ.600 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను భీమవరంలో ఓడించడానికి రాజకీయ పార్టీలు భారీ కుట్రకు తెరలేపాయని ఒక్కో ఓటుకు రూ.3,000 ఖర్చు పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ సంచలన ఆరోపణ చేశారు.

డబ్బు దొరికిన నియోజకవర్గాల్లో మళ్ళీ ఎన్నికలు జరపాలని డిమాండ్

డబ్బు దొరికిన నియోజకవర్గాల్లో మళ్ళీ ఎన్నికలు జరపాలని డిమాండ్

ఇక ఏపీ ఎన్నికల్లో పోలీసుల తనిఖీల్లో డబ్బులు దొరికిన ప్రతీ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమయిందనీ, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. మొత్తానికి పవన్ ను ఓడించటానికి కూడా పెద్ద కుట్రే జరిగిందని రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు జనసైనికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

English summary
There is tension in the AP election after the polls are over. The electorate is politically hot with sensational allegations. CPI leader Ramakrishna expressed his anger over political parties in the Andhra Pradesh Assembly polls. The party claimed that political parties have closed a huge conspiracy to defeat Jasena's chief Pawan Kalyan in Bhimavaram. CPI leader Ramakrishna has allegedly said that political parties spent Rs 3,000 per vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X