జెడ్పీటీసీ - ఎంపీటీసి ఓట్ల లెక్కింపు- మధ్నాహ్నానికి ఫలితాలు : జమ్మలమడుగుపై ఉత్కంఠ..!!
ఏపీలో మరో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరగనుంది. బుధవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో అధికార వైసీపీలో జోష్ కనిపిస్తోంది. నెల్లూరు కార్పోరేషన్ లో ఏకపక్షంగా.. కుప్పంలోనూ వైసీపీ గెలుపొందింది. ఇక, తమ ఓట్ల శాతం పెరిగిందని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో ఇప్పుడు జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం
ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది గంటలకు తేలతాయని, జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొద్ది నెలల క్రితం జరిగిన కోర్టులో కేసులు..కోర్టు అనుమతితో జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే, కోర్టు స్టే కారణంగా ఓట్ల లెక్కింపుకు మాత్రం పోలింగ్ తరువాత చాలా కాలం నిరీక్షించాల్సి వచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల రద్దుకు సైతం ఆదేశాలిచ్చింది. అయితే, దీని పైన డివిజన్ బెంచ్ కు వెళ్లిన ఎన్నికల సంఘానికి కోర్టు అనుమతి ఇవ్వటంతో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది.

జమ్మలమడుగు ఫలితం పై ఆసక్తి
ఆ సమయంలో కొన్ని చోట్ల ఎన్నికలు జరగని స్థానాలు.. పోలింగ్ జరిగిన తరువాత మరణించిన అభ్యర్ధులు గెలిచిన ప్రాంతాల్లోనూ తిరిగి ఎన్నికలు నిర్వహించారు. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదే సమయంలో సుదీర్ఘ కాలం ఓట్ల లెక్కింపు కోసం వేచి చూడాల్సి రావటంతో జమ్మలమడుగు వంటి ప్రాంతాల్లో ఓట్లు తడిసి లెక్కింపుకు వీలు లేకుండా పోవటంతో, తిరిగి రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ రోజున వెల్లడి కానున్న జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం పైన ఆసక్తి నెలకొని ఉంది.

వైసీపీ వర్సెస్ టీడీపీ హోరాహోరీగా
సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల సమయంలో కేవలం రెండు పోలింగ్ బూత్‌లలో ఓట్ల లెక్కింపునకు వీలులేని పరిస్థితిలో ఫలితం ప్రకటన వాయిదాపడిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానం విజేత ఎవరో కూడా తేలనుంది.
అప్పట్లో ఈ జెడ్పీటీసీ స్థానంలో లెక్కింపు జరిగినంతవరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.. ఆ తర్వాత స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి కంటే 517 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆ జెడ్పీటీసీ స్థానం పరిధిలోని గొరిగనూరు ఎంపీటీసీ స్థానంలో మొత్తం 827 మంది ఓటర్లున్న రెండు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు తడిసి లెక్కింపునకు వీలుగా లేవని అప్పట్లో కౌంటింగ్ సిబ్బంది తేల్చారు.
Recommended Video

మున్సిపల్ ఫలితాల తరువాత ఆసక్తి కరంగా
మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 517గా ఉండడం, లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లు అంతకంటే ఎక్కువ ఉండడంతో అప్పట్లో ఆ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారు. తాజాగా ఆ రెండు పోలింగ్ బూత్‌లలో మంగళవారం పోలింగ్ నిర్వహించగా 757 ఓట్లు పోలయ్యాయి. ఈ 757 ఓట్లే ఇప్పుడు ఆ జెడ్పీటీసీ విజేతను నిర్ణయించనున్నాయి.
అప్పట్లో ఓట్లు తడిసిన కారణంగా ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాల ప్రకటనను వాయిదావేశారు. రీ పోలింగ్ నిర్వహించడంతో ఆ ఆరు ఎంపీటీసీ స్థానాల ఫలితాలు కూడా తేలనున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల కంటే హోరోహోరీగా ఈ విడత జరిగాయి. దీంతో.. అధికార పార్టీ గతంలో చూపినట్లుగా ఏకపక్షంగా ఫలితాలు సాధిస్తుందా... ప్రతిపక్షాలు ఏ మేర సీట్లు - ఓట్లు సాధిస్తారనేది ఈ ఫలితాల ద్వారా స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications