వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రోజుల పాటు కాలనాగులతో పోరాటం:బ్రతుకుపోరులో శునకందే విజయం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లా: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ శునకానికి లోపల మరింత ప్రమాదం ఎదురైంది. ఆ బోరు బావిలో అప్పటికే నివాసం ఉంటున్న రెండు పెద్ద తాచు పాములు ఈ శునకాన్ని కాటు వేసేందుకు ప్రయత్నించాయి.

ఒక్కొక్కటి పది అడుగుల పొడవున్న ఆ భారీ తాచు పాములకు తనను కాటేసే అవకాశం ఇవ్వకుండా శునకం అత్యంత క్లిష్టమైన బ్రతుకు పోరాటం మొదలు పెట్టింది. తిండీతిప్పలు లేకుండా అలా నీళ్లలోనే రెండు రోజులపాటు పోరాడుతూ ఆ కాలనాగులను నిలువరిస్తూనే ఉంది. చివరకు రెండు రోజులు గడిచాక ఒక రైతు ఈ కుక్క అరుపులు విని బావిలోకి తొంగి చూశాడు. పరిస్థితి అర్థం చేసుకొని ఆ కుక్క ను కాపాడాడు...అలా ఆ కుక్క తన జీవన పోరాటంలో విజేతగా నిలిచింది...వివరాల్లోకి వెళితే...

The dog fell into the well ... Fighting for two days with the Cobras ... finally survived

కృష్ణా జిల్లా పోరంకి లో ప్రియా ఫుడ్స్‌ పక్కనున్న కిలారు దిలీప్‌ పొలాన్ని ఈడ్పుగల్లుకు చెందిన కుసులూరి వెంకట ప్రసాద్‌ అనే రైతు కౌలుకి తీసుకొని అరటి సాగు చేస్తున్నాడు. ఆ పొలంలో ఒక బోరుబావి ఉంది. మంగళవారం రాత్రి ఆ బోరుబావిలో ప్రమాదవశాత్తు ఓ కుక్క పడిపోయింది. అయితే ఆ బావిలో ఎప్పటినుంచో రెండు పెద్ద త్రాచుపాములు నివాసం ఉంటున్నాయి.

దీంతో ఒక్కసారిగా తమ సామ్రాజ్యంలోకి వచ్చి పడిన ఆ కుక్కను మట్టుబెట్టేందుకు ఆ రెండు తాచు పాములు తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాయి. ఆ కుక్కను కాటేసేందుకు విశ్వప్రయత్నం చేశాయి. అయితే ఈ కుక్క వాటికి తనను కాటేసే అవకాశం ఇవ్వకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ అలాగే నిలువరిస్తూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం కొనసాగిస్తూ వచ్చింది.

ఇలా ఆ కాల నాగులతో ఈ కుక్క పోరాటం రెండు రోజుల పాటు కొనసాగింది. కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆ బోరు బావి ఉన్న పొలాన్ని సాగు చేస్తున్న కౌలు రైతు కుసులూరి వెంకట ప్రసాద్‌ గురువారం పొలం పనికి వచ్చాడు. ఆ సమయంలో బావిలో నుంచి కుక్క అరుపులు విని వెళ్లి చూశాడు. లోపల పది అడుగులు పొడవున్న రెండు తాచు పాములు ఆ కుక్కపై కాటు వేసే ప్రయత్నం చేస్తుండటం చూసి అదిరి పోయాడు.

అయినా ఆ కుక్కని అలా వదిలివేయలేక తన వద్ద ఉన్న తాడు మోకుతో శ్రమించి ఆ శునకాన్ని బావి నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడి వ్యవసాయ కూలీలు కూడా అక్కడకు చేరుకొని శునకం బయటకు రావడానికి ప్రసాద్ కు సహకరించారు. దీంతో ఆ కుక్క బావి నుంచి ప్రాణాలతో బైటపడింది. అంతేకాదు బ్రతుకు పోరాటంలో విజేతగా నిలిచింది.

English summary
Vijayawada:This is an interesting event that a dog fell in a bore well and fought two days with two big Cobras. Finally, the dog has survived with the help of one former. The incident took place in Krishna district war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X