వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక పోరులో ఆధిపత్య పోరు: మరోమారు ఎమ్మెల్యే ఆర్థర్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఇన్‌చార్జి బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి మధ్య ఏ మాత్రం పొసగటం లేదు. ఇప్పటికే పలు మార్లు వీరి మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బహిర్గతం కాగా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. స్థానిక అధికార పార్టీ నేతలకు వీరి మధ్య అంతర్గత ఘర్షణలు తలనొప్పిగా మారాయి.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు

కర్నూలుకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటు ఎమ్మెల్యే ఆర్ధర్ , అలాగే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. తాము సూచించిన వారికే అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం నేపధ్యంలో అధిష్టానం ఉన్న మొత్తం ఆరు మండలాల్లో చెరొక మూడు మండలాలకు అభ్యర్థులను ఫైనల్ చెయ్యమని పంచింది. ఇక ఈ క్రమంలో కూడా వీరి మధ్య రచ్చ కొనసాగుతుంది. అందుకు కారణం లేకపోలేదు .

అభ్యర్థుల ఎంపికలో రగడ .. ఆందోళన చేసిన ఎమ్మెల్యే వర్గీయులు

అభ్యర్థుల ఎంపికలో రగడ .. ఆందోళన చేసిన ఎమ్మెల్యే వర్గీయులు

కర్నూలులోని ఓ హోటల్లో మంత్రి అనిల్‌కుమార్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కసరత్తు చేస్తుండగా, బయట నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గీయులు ఆందోళనకు దిగారు. అందుకు కారణం చేరి మూడు మండలాలు కేటాయించినప్పటికీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నాలుగు మండలాల అభ్యర్థులు తానూ సూచించిన వారికే ఇవ్వాలని కోరటంతో ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆర్థర్ కు బీ ఫారాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ నినాదాలు చేశారు.

దళిత ఎమ్మెల్యేకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన

దళిత ఎమ్మెల్యేకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన

అయితే, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్, ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెరో మూడు మండలాలు అప్పగిస్తే ఎవరి పరిధిలో వారు ఎంపిక చేసుకోవాల్సి ఉండగా బైరెడ్డి మాత్రం నాలుగు మండలాల అభ్యర్థులను సూచిస్తున్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే ఆర్థర్ ఆగ్రహానికి కారణం అవుతుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాలుగు మండలాలు కావాలంటున్నారని,అందుకు ఇంచార్జ్ లు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది ఆర్థర్‌ వర్గం. దళిత ఎమ్మెల్యేకు అన్యాయం చేస్తున్నారంటూ చేపట్టిన ఈ ఆందోళన ఒక దశలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది.

తీవ్ర ఉద్రిక్తత .. సమావేశం నుండి వెళ్ళిపోయిన ఆర్థర్

తీవ్ర ఉద్రిక్తత .. సమావేశం నుండి వెళ్ళిపోయిన ఆర్థర్

ఆర్థర్, సిద్ధార్థరెడ్డి వర్గీయులు ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. దాడులు చేసుకునే దాకా ఘర్షణ జరిగింది. ఇక పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. హోటల్ ఎదుట ఆందోళన కొనసాగుతుండగానే అభ్యర్థుల ఎంపిక చేసే సమావేశం నుంచి ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లిపోయారు . సిద్ధార్థ రెడ్డికి 4 మండలాలు ఇస్తే అసలు తనకు ఏమీ అవసరంలేదని, అన్ని మండలాలకు అభ్యర్థుల్ని మీరే ఎంపిక చేసుకోండి అంటూ చాలా అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోయారు.

Recommended Video

Janasena Party Senior Leader Resigned And Joined In YSRCP| Oneindia Telugu
ఆర్థర్ వెళ్ళిపోయినా కొనసాగిన సమావేశం .. ఏం జరుగుతుందో ?

ఆర్థర్ వెళ్ళిపోయినా కొనసాగిన సమావేశం .. ఏం జరుగుతుందో ?

తన దారి తాను చూసుకుంటానని ఆవేదన చెందారు. ఇక, ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లిపోయాక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగింది. ఎమ్మెల్యే ఆర్థర్ ఏ నిర్ణయం తీసుకుంటారు.. తమ జిల్లాకి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న మంత్రి తీరుతో కూడా ఆయన తీవ్రంగా అవ్ధనకు గురయ్యారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే ఉత్కంఠ నెలకొంది.నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఈ వ్యవహారంలో సీఎం జగన్ ను కలుస్తారా ? లేకా మరేదైనా నిర్ణయం తీసుకుంటారా ? అన్నది తెలియాల్సి ఉంది.

English summary
In Kurnool district, there are conflicts between YCP leaders in the election of local bodies. MLA Arthur and Bireddy Siddharth Reddy are on the verge of dominating in the candidates selection . they are trying to give them the opportunity to nominate their candidates . However, the dispute between the two has led to the tension in kurnool district during the local body elections .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X