• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ నాలుగు జిల్లాలో అంతుచిక్క‌ని రాజ‌కీయం..! బ‌ల‌ప‌డింది అదికార ప‌క్ష‌మా..? ప‌్ర‌తిప‌క్ష‌మా..?

|

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : స‌ర్వేల‌కు దొర‌క‌ని ఓట‌రు నాడి. అంచ‌నాల‌కు అంద‌ని ఏపీ ప్ర‌జ‌ల తీర్పు. ఎవ‌రికి వారు పైకి గంబీరంగా క‌నిపిస్తున్నా లోలోప‌ల మాత్రం కంగారుప‌డిపోతున్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీల‌కు 2019 గెలుపు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది. మూడు నెల‌ల క్రితం టీడీపీ ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలతో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారింది. అసెంబ్లీ బ‌రిలో బిగ్‌ఫైట్ ఇరు పార్టీల‌నూ ఒత్తిడికి గురిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో 2014లో టీడీపీ బ‌ల‌హీనంగా ఉన్న జిల్లాల్లో ప‌ట్టు సాధించి వైసీపీను దెబ్బ‌తీయాల‌ని ఎత్తులు వేస్తూ వ‌చ్చింది. ఆ మేర‌కు.. వైసీపీ అధిక అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న జిల్లాల్లో వ‌ల‌స‌ల‌కు ఎర్ర‌తివాచీ ప‌రిచింది. ఇప్పుడు అవే జిల్లాల్లో తిరిగి వైసీపీ పాత స్థానాల‌తోపాటు కొత్త‌వాటిలో పాగా వేయాల‌ని పావులు క‌దుపుతోంది.

<strong>స‌ర్వే నివేదిక‌ల‌తో స‌గం చ‌చ్చిపోతున్న నేత‌లు.! స‌ర్వే ఫ‌లితాల‌తో నిద్రప‌ట్ట‌డం లేదంటున్న నేత‌లు..!!</strong>స‌ర్వే నివేదిక‌ల‌తో స‌గం చ‌చ్చిపోతున్న నేత‌లు.! స‌ర్వే ఫ‌లితాల‌తో నిద్రప‌ట్ట‌డం లేదంటున్న నేత‌లు..!!

ఏపిలో వేడెక్కిన రాజ‌కీయాలు..! జిల్లాల‌ను జ‌ల్లెడ ప‌డుతున‌న్న ముఖ్య నేత‌లు..!!

ఏపిలో వేడెక్కిన రాజ‌కీయాలు..! జిల్లాల‌ను జ‌ల్లెడ ప‌డుతున‌న్న ముఖ్య నేత‌లు..!!

టీడీపీ ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌కు తిరుగులేని మెజార్టీ తెచ్చిపెడ‌తాయ‌ని భావిస్తుంది. వాటిలో నాలుగు జిల్లాలు కీల‌కంగా మారాయి. సీఎం చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు కూడా ఉండ‌టం విశేషం. 2014లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 08 వైసీపీ, కేవ‌లం 06 మాత్ర‌మే టీడీపీ గెలుచుకున్నాయి. అనంత‌రం వైసీపీ నుంచి అమ‌ర్నాధ‌రెడ్డి సైకిల్ ఎక్కి మంత్రి ప‌ద‌వి కొట్టేశారు. ఇప్పుడు అక్క‌డ ఓట‌రు ఎటువైపు చూస్తున్నాడ‌నేది అంచ‌నా వేయ‌లేని ప‌రిస్థితి. ప్ర‌కాశం జిల్లా ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు తిరుగులేని మెజార్టీ ఉండేది. కానీ.. క్ర‌మంగా ఆ స్థానాన్ని వైసీపీ భ‌ర్తి చేస్తూ వ‌స్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌కాశంలోని 12 నియోజ‌క‌వ‌ర్గాలలో వైసీపీ 06, టీడీపీ 05, ఆమంచి కృష్ణ‌మోహ‌న్ స్వ‌తంత్రుడుగా గెలిచాడు.తాజాగా ఆయ‌న వైసిపిలో కొన‌సాగుతున్న‌డు.

రెండు పార్టీల‌కు కీల‌కంగా మారిన చిత్తూరు, ప్ర‌కాశం, నెల్లూరు, క‌ర్నూలు జిల్లాలు..! ఏ ప‌ర్టీని గెలిపిస్తాయో..!!

రెండు పార్టీల‌కు కీల‌కంగా మారిన చిత్తూరు, ప్ర‌కాశం, నెల్లూరు, క‌ర్నూలు జిల్లాలు..! ఏ ప‌ర్టీని గెలిపిస్తాయో..!!

ప్ర‌కాశం జిల్లాలో క‌మ్మ‌, కాపు, రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య పోరు ఎవ‌రికి లాభిస్తుంద‌నేది స‌వాల్ మారింది. కోస్తా మొద‌ల‌య్యే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ 07 స్థానాలు, రెండు పార్ల‌మెంట‌రీ స్థానాల‌ను గెలిచింది. కేవ‌లం 03 సీట్ల‌లో టీడీపీ ఒడ్డున ప‌డింది. ఇప్పుడు అక్క‌డ సోమిరెడ్డి, నారాయ‌ణ వంటి దిగ్గ‌జాల గెలుపు టీడీపీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లో పెద్ద‌గా సాధించిన విజ‌యాల్లేవు. అటువంటిచోట‌.. ఇప్పుడు వైసీపీకి బ‌లంగా ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి చేరారు. ఫ్యాక్ష‌న్‌కు కేరాఫ్‌గా చెప్పుకునే క‌ర్నూలు రాజ‌కీయం ఈ ద‌ఫా ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

 రాయ‌ల‌సీమ‌లో పుంజుకునేది ఎవ‌రు..? వైసీపి టార్గెట్ పూర్తి చేసుకుంటుందా..?

రాయ‌ల‌సీమ‌లో పుంజుకునేది ఎవ‌రు..? వైసీపి టార్గెట్ పూర్తి చేసుకుంటుందా..?

భూమా కుటుంబం నుంచి మూడోత‌రం నేత‌లు ఈ సారి ముందుడి న‌డుపుతున్న ఎన్నిక‌లు 2014లో భూమా శోభానాగిరెడ్డిని రోడ్డు ప్ర‌మాదం క‌బ‌ళించింది. 2017లో గుండెపోటు భూమా నాగిరెడ్డిని మృత్యుఒడికి చేర్చింది. దీంతో ఇప్పుడు అక్క‌డ భూమా అఖిల‌ప్రియ అన్నీ తానై నంద్యాల రాజ‌కీయం న‌డిపిస్తున్నారు. గ‌తంలో వైసీపీలో ఉన్న ఈ కుటుంబం త‌రువాత టీడీపీలోకి చేరింది. 2014లో క‌ర్నూలుజిల్లాలో 14 అసెంబ్లీ సీట్ల‌లో 11 వైసీపీ గెలుచుకుంది. కేవ‌లం 03 మాత్ర‌మే నెగ్గి ప‌రువు కాపాడుకుంది. రెండు పార్ల‌మెంటు స్థానాల్లోనూ వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఇప్పుడు అక్క‌డ‌.. 2014లో శ‌త్రువులుగా పోటీకి దిగిన నాయ‌కులు.. టీజీ వెంక‌టేష్‌, కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డి, కేఈకృష్ణ‌మూర్తి , భూమా కుటుంబాలు టీడీపీలో ఉన్నాయి.

 ఉభ‌య‌గోదావ‌రిలో త‌గ్గిన టీడిపి హ‌వా..! ఈ నాలుగు జిల్లాల్లో పుంజుకోవాల‌ని చూస్తున్న టీడిపి..!!

ఉభ‌య‌గోదావ‌రిలో త‌గ్గిన టీడిపి హ‌వా..! ఈ నాలుగు జిల్లాల్లో పుంజుకోవాల‌ని చూస్తున్న టీడిపి..!!

ఒక‌రి గెలుపుకోసం ఒక‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఫ్యాక్ష‌న్ త‌గాదాలు.. పాత ప‌గ‌లు విడ‌చి అధికారం కోసం ఏక‌మైన వీరిని.. క‌ర్నూలు ప్ర‌జ‌లు అక్కున చేర్చుకుంటారా.. టీడీపీకు తిరుగులేని మెజార్టీ ఇస్తారా! అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ నాలుగు జిల్లాల‌పై టీడీపీ ప్ర‌త్యేక దృష్టి సారించేందుకు ప్ర‌ధాన కార‌ణం లేక‌పోలేదు. టీడీపీ జెండా ఎగుర‌వేయాల‌ని కోరుకోవ‌డం, మ‌రొక‌టి.. గ‌త ఎన్నిక‌ల‌తో పోల్సితే ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ ప్రాభ‌వం త‌గ్గ‌టం. అక్క‌డ వ‌చ్చిన న‌ష్టాన్ని ఈ నాలుగు జిల్లాల్లో పూడ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్థాయో చూడాలి.

English summary
In 2014, the TDP has been able to grip in the 4 districts. In this case, the tdp had rediscovered the welfare of districts in winning high assembly seats. Compared to the last election, TDP is the best in Uttarandhra and Godavari districts. There are attempts to bury the damage in these four districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X