వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగాస్టార్ కుటుంబం ఔదార్యం..!సభ్యులందరూ కరోనా అవగాహనకే అంకితం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రసార మాధ్యమాల్లో ప్రతి గంట గంటకీ ఓ స్టార్ హీరో అతని కుమారుడు కరోనా వైరస్ పట్ల అదే పనిగా అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఉపాది కోల్పోయి నిస్సహాయ స్థితలో ఉన్న పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు ఓ ట్రస్టును నెలకొల్పి దాని ద్వారా నిత్యావసర సరుకులు ఉతితంగా పంపిణీ చేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు ఆ టాప్ హీరో. అంతే కాకుండా కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడమే కాకుండా, క్లిష్ట సమయంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అండగా ఉండాలని రెండు తెలగు రాష్ట్రాల్లో ఉన్న తన అభిమాన సంఘాలకు పిలునిచ్చారు. ఆయనే మెగస్టార్ చిరంజీవి.

కరోనా అవగాహన కార్యక్రమంలో ముందున్న చిరంజీవి.. అప్రమత్తంగా ఉండాలంటున్న కుటుంబ సభ్యులు...

కరోనా అవగాహన కార్యక్రమంలో ముందున్న చిరంజీవి.. అప్రమత్తంగా ఉండాలంటున్న కుటుంబ సభ్యులు...

రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక స్ధానం ఉంది. బ్లడ్ బాంక్ ద్వారా ప్రాణాపాయంలో ఉన్న నిరుపేదలకు ఉచితంగా రక్తాన్ని అందిస్తోంది చిరంజీవి బ్లడ్ బాంక్. ఇదో బృహత్కర కార్యక్రమంలా దగ్విజయంగా ముందుకు వెళ్తోంది. ఇక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, హుద్ హుద్ లాంటి తుపానులు రాఫ్ట్రం పై విరుచుకుపడ్డప్పుడు ప్రజలను ఆదుకునేందుకు మేమున్నామని ముందుకు వస్తారు చిరంజీవి. ప్రస్తుతం కరోనా కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో తానే కాకుంగా తన కుటుంబ సభ్యులతో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చిరంజీవి.

రంగంలోకి దిగిన రాంచరణ్, ఉపాసన.. కరోనా మీద యుద్దం చేయాలని పిలుపు..

రంగంలోకి దిగిన రాంచరణ్, ఉపాసన.. కరోనా మీద యుద్దం చేయాలని పిలుపు..

కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజానికం తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి మెగాస్టార్ ఒక్కరే కాకుండా తన కుటుంబ సభ్యులందరూ చొరవచూపిస్తున్నారు. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన యువ హీరో రాంచరణ్ తేజ కూడా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముందుండి స్పందించే చిరంజివి ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో కూడా ముందువరసలో నిలబడి ముందస్తు జాగ్రత్తలు వివరిస్తున్నారు.

పేదల పట్ల చిరంజీవి ఔదార్యం.. ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న మెగాస్టార్..

అంతే కాకుండా మొదటి రోజు నుండీ కరోనా వైరస్ గురించి మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు, ప్రజలకు సందేశాలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లేని కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసి పేద సిసీ కళాకారులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. తన వంతు బాద్యతగా ఉచిత నిత్యవసర సరుకులు కూడా ఇంటింటికి అందేజేస్తున్నారు చిరంజీవి. అంతే కాకుండా చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన కూడా తన సేవా భావాన్ని చాటుకుంటున్నారు. తన వ్యాపార కలాపాలను పక్కన పెట్టి కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజానికానికి పలు సలహాలు సూచనలు ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Recommended Video

Pawan Kalyan Appreciates Prabhas ,Mahesh Babu, Jr NTR, Allu Arjun For Their Donations

కుటుంబ సభ్యులందరి భాగస్వామ్యం.. కరోనా మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యమంటున్న ఉపాసన..

స్వీయ నియంత్రణ పాటిద్దాం, ఇంట్లోనే ఉంటాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు.. ప్రేమను పంచుదాం. కాలు కదపకుండా.. కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై.. భారత్‌ను గెలిపిస్తాం అంటూ మెగా స్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, శ్రీజ దంపతులు, వైష్ణవ్ తేజ్‌లు కలిసి డ్రాయింగ్ చేసిన ప్లకార్డులు పట్టుకుని కరోనా మహమ్మారి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. దేశంలో క్లిష్ట సమస్యలు తలెత్తినప్పుడు మనకెందుకులే అని తేలిగ్గా తీసుకోకుండా తమవంతు బాధ్యతను నిర్వర్తించడం పట్ల సానుకూల వాతావరణం వ్యక్తం అవుతోంది.

English summary
Mega family members are constantly sending messages to fans and people about the corona virus. The Megastar Chiranjeevi Corona Crisis Charity has set up a charity for poor artists to help those who are not in shooting. In addition, Chiranjeevi daughter in-law and Rancharan's wife Upasana also express their service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X